Begin typing your search above and press return to search.
కేసీఆర్ జైలుకెళ్ళడం ఖాయం..ఈ జోస్యం ఎవరిదంటే..
By: Tupaki Desk | 31 Aug 2019 11:03 AM GMTకల్వకుంట్ల చంద్రశేఖర రావు... ఈ పేరుకు పరిచయం అక్కరలేదు. ప్రస్తుతం తెలంగాణ సీఎంగా దేశంలోనే చిరపరిచితుడైన వ్యక్తి. కేసీఆర్ గా అందరి చేత పిలిపించుకునే ఇతడు అధికారం మారగానే జైలుకు వెళ్ళడం ఖాయమట... జైలు ఊచలు లెక్కించడం... జైలులో చిప్పకూడు తినడం తథ్యమట... ఇంతకు కేసీఆర్ ఎందుకు జైలుకు వెళతాడు. జైలుకు వెళతాడని ముందుగానే బ్రహ్మంగారి లాగా జోస్యం చెప్పిన ఈ జ్యోతిష్యుడు ఎవరు... ఇప్పుడు ఇది తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది...
కేసీఆర్ ఓ లెక్చరర్ గా జీవితం ప్రారంభించి కాంగ్రెస్ లో రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాడనేది ప్రతీతి. అయితే అన్న నందమూరి తారక రామారావు తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో తెలుగు దేశం పార్టీని స్థాపించగానే టీడీపీలో చేరిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉరఫ్ కేసీఆర్ అంచెలంచెలుగా ఎదుగుతూ టీడీపీలో మంత్రిగా - డిప్యూటీ స్పీకర్ గా పనిచేసే దశకు చేరుకున్నాడు.. అలా రాజకీయంగా ఎదిగిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తలకెత్తుకున్నాడు. తెలంగాణ పోరాటంలో చివరికి విజయం సాధించి తెలంగాణ కు తొలి సిఎం అయ్యాడు.
తెలంగాణలో జరిగిన రెండో ధపా ఎన్నికల్లో విజయదుందిభి మోగించి మరోమారు అధికారాన్ని హస్తంగతం చేసుకున్నాడు. అలా రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయమని ఓ సీనియర్ రాజకీయ నాయకుడు జోష్యం చెప్పడం విశేషం. ఇంతకు ఈ జోస్యం చెప్పిన నేత ఎవరో కాదు.. కేసీఆర్ తో పాటు ఒకేపార్టీలో స్నేహం చేసిన పాతస్నేహితుడు - మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్థన్ రెడ్డి. నాగం జనార్థన్ రెడ్డి - కేసీఆర్ ఒకేసారి మంత్రులుగా పనిచేశారు.
అయితే ఇప్పుడు నాగం జనార్థన్ రెడ్డి కాంగ్రేస్ లో ఉన్నారు. ఆయన కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమంటున్నాడు.. కేసీఆర్ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతుందట.. ఈ అవినీతి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సాగుతుంది... కానీ అధికారం పోయినంక వచ్చే ప్రభుత్వం కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి అరెస్ట్ చేసి జైలుకు పంపుతుందని నాగం చెపుతున్నారు. ఎందరో ముఖ్యమంత్రులు - మంత్రులు అధికారం పోయినంక జైలుకు వెళ్ళారట.. అందుకే అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్ - ఆయనతో పాటు ఆయన మంత్రులు కూడా జైలుకు వెళతారని జోస్యం నాగం జోస్యం చెపుతున్నారు.