Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు క్షీరాభిషేకం చేస్తానంటున్న బీజేపీ నేత
By: Tupaki Desk | 10 July 2016 3:53 PM GMTతెలంగాణలో బీజేపీ - టీఆరెస్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అలాంటి తరుణంలో తెలంగాణ బీజేపీ నేత ఒకరు టీఆరెస్ అధినేత - తెలంగాణ సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తానని ప్రతిపాదించారు. ఇదేమిటీ వింత అనుకుంటున్నారా... అక్కడే ఉంది అసలు విషయం. 30 నెలల్లో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తానని కేసీఆర్ చెబుతుండడంతో అన్న మాట ప్రకారం ఆయన అలా చేయగలిగితే అప్పుడు తాను క్షీరాభిషేకం చేస్తానని ఆయన అన్నారు. కాంట్రాక్టర్ల లబ్ధికే ప్రాజెక్టులు కడుతున్న కేసీఆర్ వల్ల ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం సాధ్యం కాదని ఆయన ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కనుక అన్న మాట ప్రకారం 30 నెలల్లో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తే ఆయనకు పాలాభిషేకం చస్తానని బీజేపీనేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చడానికే కేసీఆర్ ప్రాజెక్టులు చేపడుతున్నాడని ఆరోపించారు. తెలంగాణ సర్కారు రాష్ట్రంలో మెరుగైన పాలన అందిస్తున్నామని చెబుతూ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. అన్నీ మాటలే తప్ప పనులేమీ కనిపించడం లేదని ఆయన మండిపడ్డారు.
కాగా టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నాగం అక్కడ కొంతకాలం యాక్టివ్ గా ఉన్నా ఆ తరువాత పూర్తిగా సైలెంటయిపోయారు. ఒక దశలో ఆయన టీఆరెస్ లో చేరుతారన్న ప్రచారమూ జరిగింది. కానీ ఎందుకనో అది ఆగిపోయింది. ఆ తరువాత ఆయన మళ్లీ యాక్టివయ్యారు. మునుపటి స్పీడు లేకపోయినా ఆయన ఇటీవల కాలంలో తనదైన శైలిలో ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారు. మరోవైపు తెలంగాణలో పార్టీలకతీతంగా రెడ్డి నేతలను ఏకీకరణ చేయాలన్న ఉద్దేశంలోనూ ఆయన ఉన్నట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ - టీడీపీలోని రెడ్డి నేతలతో ఆయన టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాగం మళ్లీ దూకుడు పెంచడం స్వప్రయోజనాలకా బీజేపీ ప్రయోజనాలకా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. అయితే.. నాగం వేగం చూసి బీజేపీ నేతలు మాత్రం సంబరపడుతున్నారట. తెలంగాణ బీజేపీ తగినంత దూకుడు చూపడం లేదని పార్టీ అధిష్ఠానం భావిస్తున్న తరుణంలో అధ్యక్షుడు లక్ష్మణ్ కు తోడుగా నాగం కూడా ప్రభుత్వంపై విరుచుకుపడడం శుభపరిణామమే అంటున్నారు.