Begin typing your search above and press return to search.
అరుణమ్మ వద్దన్నా..నాగం ఎంట్రీ...డేట్ ఇదే
By: Tupaki Desk | 11 March 2018 6:33 AM GMTరాబోయే ఎన్నికల్లో అధికార టీఆర్ ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దె దించాలనే లక్ష్యం పెట్టుకొని...ఇందుకోసం ఇతర పార్టీ నుంచి చేరికలను ప్రధాన అస్త్రంగా చేసుకొని ముందుకు సాగుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన దూకుడును కొనసాగిస్తోంది. అయితే కొత్త నేతలను ఆహ్వానించేందుకు పార్టీ సీనియర్లు నో చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం ఈ ట్రెండ్ ను కొనసాగిస్తున్నారు! పార్టీ నేతల ఆవేదనను లైట్ తీసుకుంటున్నారు!! అలా పార్టీ నేతలు వెల్ కం చెప్పేసిన తాజా నాయకుడు సీనియర్ రాజకీయవేత్త అయిన నాగం జనార్దన్ రెడ్డి కాగా - సొంత పార్టీ నుంచే షాక్ ను ఎదుర్కున్నది ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా పేరొందిన ఎమ్మెల్యే - మాజీ మంత్రి డీకే అరుణ.
కాంగ్రెస్‌లోని విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం బీజేపీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ లో చేరాలనుకున్న నాగం జనార్దన్ రెడ్డికి ఆ పార్టీ ఓకే చెప్పేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కొప్పుల రాజు ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని రంగంలోకి దింపే అంశంతో పాటూ నాగం చేరిక విషయంలో ఆయన రాష్ట్ర నేతల అభిప్రాయం తెలుసుకునేందుకు ఒక ప్రముఖ హోటల్ లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా - పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి - వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క - పీసీసీ సీఎల్పీ నేత జానారెడ్డి - మండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ ఆలీ తదితరులతో కొప్పుల రాజు భేటీ అయ్యారు. దాదాపుగా ఆర్థరాత్రి వరకూ రాష్ట్ర నేతలతో చర్చించి నాగం జనార్ధనరెడ్డి కాంగ్రెస్ లో చేరటానికి లైన్ క్లియర్ చేశారు.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాగం చేరిక కోసం ఏఐసీసీ స్థాయిలో అదే జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి పావులు కదిపారు. అయితే నాగం చేరికను డీకే ఆరుణ - ఎమ్మెల్సీ దామోదరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు అయిన కొప్పుల రాజు ఎంట్రీ ఇచ్చి ఈ ఇద్దరు నేతలతో మాట్లాడారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే నేతలను చేర్చుకోవాలని రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని రాష్ట్ర నేతలకు కొప్పుల రాజు మరొక సారి గుర్తు చేసినట్టు వారు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పార్టీ అశయాలు, సిద్ధాంతాలు నమ్మి వచ్చే వారిని సాదరంగా ఆహ్వానించాలని ఆయన కొప్పుల రాజు రాష్ట్ర నేతలకు చెప్పారు. నాగం చేరిక విషయంలో పార్టీలోని సీనియర్ నేతలంతా అంగీకిరిచంటంతో ఆయన చేరిక కేవలం లాంఛన ప్రాయమేనని తెలిసింది. ఈ నెల మూడవ వారంలో జరిగే ఏఐసీసీ ప్లీనరీ సమావేశాల తర్వాత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని నాగం జనార్థనరెడ్డి భావిస్తున్నారు. అయితే దీనిపై త్వరలో పూర్తి క్లారిటీ రానున్టన్లు సమాచారం.