Begin typing your search above and press return to search.

చాలా విషయాలు ఓపెన్ గా చెప్పిన నాగం

By:  Tupaki Desk   |   17 Aug 2015 7:26 AM GMT
చాలా విషయాలు ఓపెన్ గా చెప్పిన నాగం
X
మంచి మాటకారి అయిన తెలంగాణ నేత నాగం జనార్ధనరెడ్డి లో సెన్సాఫ్ హ్యుమరే కాదు.. సబ్జెక్ట్ కూడా ఎక్కువే. తాజాగా ఆయన ఓ టీవీ ఛానల్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో చాలా విషయాల్ని ఓపెన్ గా చెప్పుకొచ్చారు.

ఈ మధ్య కాలంలో నాగం పార్టీ మారతారని.. అధికారపార్టీలోకి కానీ.. మాతృసంస్థలోకి మారుతున్నట్లుగా చాలానే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. బచావో తెలంగాణ పేరిట ఒక వేదికను ఏర్పాటు చేసిన అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. తాజాగా షోలో పాల్గొన్న ఆయన.. తనపై వస్తున్న వార్తల్ని వదంతులుగా కొట్టేసిన ఆయన.. ఓపెన్ గా చాలా విషయాలు చెప్పుకొచ్చారు.

తాను టీడీపీని విడిచి పెట్టి వచ్చింది కేవలం తెలంగాణ సాధించటం కోసమే తప్పించి మరొకటి కాదన్నారు. తనను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారని.. కానీ తాను వెళ్లలేదన్నారు. తెలంగాణ సాధన కోసం తాను టీడీపీని వదిలి వచ్చే సమయంలో తన వెంట మరో నలుగురు నేతలు కానీ వచ్చేసి ఉంటే.. కీలక పరిణామాలు చోటు చేసుకునేవని వెల్లడించారు.

బీజేపీ అగ్రనేత రాజ్ నాథ్ సింగ్ కోరటంతో తాను బీజేపీలోకి వచ్చిన తాను.. పార్టీ మారే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పారు. బీజేపీని విడిచి పెట్టి టీఆర్ఎస్.. టీడీపీలోకి వెళ్లనున్నట్లుగా వస్తున్న వార్తలన్నీ ఉత్తవేనని చెప్పిన ఆయన.. తెలంగాణ సాధించాల్సినవి చాలానే ఉన్నాయని.. అందుకు ప్రభుత్వంపై పోరాటానికి బచావో తెలంగాణ వేదికను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ప్రస్తుతం తనకు బీజేపీలో ఎలాంటి సమస్యలు లేవన్న ఆయన.. కిషన్ రెడ్డితో ఎలాంటి ఇబ్బందుల్లేవన్నారు. తన ఆత్మాభిమానానికి ఇబ్బంది కలిగించే పరిస్థితే ఏర్పడితే తాను చూస్తూ ఉండిపోనని చెప్పిన ఆయన.. ఇప్పటికిప్పుడు పార్టీలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పిన నాగం.. బచావో తెలంగాణ ద్వారా కానీ.. తెలంగాణకు మరంత ఉన్నతిని సాధించొచ్చని పేర్కాన్నారు. తాను తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన సమయంలో తనతో పాటు.. మరో నలుగురు నేతలు కానీ వచ్చేసి ఉంటే.. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు అప్పుడే వచ్చి ఉండేవన్నారు. విషయం ఏమైనా అనూహ్య పరిణాలు చోటు చేసుకుంటాయనే చెప్పానీ.. వాటిల్లోకి వెళ్లకుండా తన సీనియార్టీని ప్రదర్శించారని చెప్పక తప్పదు.