Begin typing your search above and press return to search.

సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారంటున్న ఎమ్మెల్యే రోజా ..ఆసలు విషయం ఇదే !

By:  Tupaki Desk   |   4 Feb 2020 5:41 AM GMT
సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారంటున్న ఎమ్మెల్యే రోజా ..ఆసలు విషయం ఇదే  !
X
వైసీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ...రాజకీయాలలో ఫైర్‌ బ్రాండ్‌ గా గుర్తింపు తెచ్చుకున్నవారిలో ఒకరు. పార్టీ మారిన. స్థానం మారినా కూడా రోజా మాటల్లో వేగం మాత్రం తగ్గలేదు. అదే స్పీడ్ తో ఎదురుగా ఉన్నది ఎలాంటివారు అని కూడా విమర్శలు , మాటకిమాట సమాధానం చెప్తూ రాజకీయాలలో ఫైర్‌ బ్రాండ్‌ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒన్స్ ఫిక్స్ అయితే వార్ వన్ సైడ్ అయిపోవాల్సిందే. విమర్శలకి దిగితే మీడియా కూడా ఆశ్చర్యపోవాల్సింది.అటువంటి వాక్చాతుర్యం ఉన్న ఎమ్మెల్యే రోజాకి రాజకీయాలలోకి వచ్చినప్పటికీ నుండి ఒక సమస్య అలానే కొనసాగుతూ వస్తుంది.

అదేమిటి అంటే ..సాధారణంగా రాజకీయ నేతలకి ఇతర పార్టీల నేతలతో సమస్యలు ఉండటం అనేది సహజం. కానీ , రోజా కి మాత్రం సొంత పార్టీ నేతలతో అసలు సమస్య. అప్పట్లో టీడీపీ ఉన్నప్పుడు ..నా ఓటమికి కారణం సొంత పార్టీ నేతలే కారణం అని తెలిపారు. అలాగే ఇప్పుడు గెలిచిన తర్వాత సొంత పార్టీ వారే ఓడించాలని చూశారని చెప్తున్నారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని ఫైర్‌ అవుతున్నారు. ఒక్కసారిగా రోజా ఫైర్ అవుతుండటంతో సొంత పార్టీ వారికే సెగ పుట్టిస్తోంది.

ఇకపోతే సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్‌ గా వెలిగిన ఆమె, రాజకీయాలలోకి వచ్చిన మొదట్లో కొన్ని రోజులు చాలా ఇబ్బందులు, అవమానాలు పడ్డారు. 2014 ఎన్నికల్లో నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా, టీడీపీ నుంచి ఆమెకు అడుగడుగునా అవమానాలే ఎదురైయ్యాయి. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి విజయం దక్కడం, పార్టీ అధికారంలోకి రావడంతో రోజాకి ఇక అన్ని మంచి రోజులే అనుకున్నారు. కానీ , ఆమెకు నియోజకవర్గంలో ఇప్పుడు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. అందులోనూ సొంత పార్టీ నేతల నుండే ఈ సమస్యలు ఎదురౌతున్నాయి.

సొంత పార్టీకి చెందిన జిల్లాకు చెందిన మంత్రి పెద్దరెడ్డి రామచంద్రా రెడ్డి తో రోజాకు విభేదాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఆయన తనను ఓడించాలని ప్రయత్నించినట్లు కూడా ఆమె వాపోతున్నారు.సొంత నియోజకవర్గంలోని ఓ గ్రామంలో సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లిన రోజాకు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. గ్రామంలో అడుగు పెట్టనివ్వకుండా స్థానిక వైసీపీ నేతలు ఆమె కాన్వాయ్‌ ని అడ్డుకున్నారు. ఈ ఘటనను రోజా చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆమె సీఎం జగన్ వద్దకి తీసుకుపోగా ..జగన్ సముదాయించారని అంటున్నారు. కానీ, ఆ తరువాత కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేకుండా పోయింది. తన నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి సొంత వర్గాన్ని తయారు చేసుకుంటున్నారని, వారంతా తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నని ఎమ్మెల్యే రోజా ఆందోళన వ్యక్తం చేస్తుంది.