Begin typing your search above and press return to search.
అమెరికాలో తెలుగు టెకీ మృతి!
By: Tupaki Desk | 2 July 2018 7:41 AM GMTఅమెరికాలో ఓ తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విహార యాత్ర విషాదాంతమైంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన టెకీ ప్రమాదవ శాత్తూ మృతి చెందాడు. నార్త్ కరోలినా ప్రాంతంలో విహారయాత్రకు గోగినేని నాగార్జున అనే టెకీ.....ప్రమాదవశాత్తూ వాటర్ ఫాల్స్ లో పడి మరణించాడు. వీకెండ్ అయిన శనివారం నాడు సరదాగా గడిపేందుకు వాటర్ ఫాల్స్ కు వెళ్లిన నాగార్జున కాలుజారి జలపాతంలో పడి ఊపిరాడక మృతి చెందాడు. నాగార్జున చనిపోయిన విషయాన్ని అతడి స్నేహితులు....కుటుంబ సభ్యులకు తెలియజేశారు. నాగార్జున మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మరణవార్త విన్న కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టెముక్కల గ్రామానికి చెందిన గోగినేని నాగార్జున పదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా అమెరికాలో స్థిరపడ్డాడు. శనివారం వీకెండ్ కావడంతో నాగార్జున నార్త్ కరోలినా ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లాడు. అయితే, అనుకోకుండా కాలుజారడంతో వాటర్ ఫాల్స్ లో పడి దుర్మరణం పాలయ్యాడు. నాగార్జున మరణవార్తను అతడి మిత్రులు...కుటుంబసభ్యులకు తెలియజేశారు. నాగార్జున మృతితో అతడి కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. నాగార్జున సోదరుడు యశ్వంత్ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు. చెల్లెలు పూజిత..తన భర్త - తల్లి రాజేశ్వరితో విజయవాడలో నివాసం ఉంటున్నారు. నాగార్జున తండ్రి గోగినేని వెంకట్రావు 7 సంవత్సరాల క్రితం మరణించారు. గొట్టెముక్కల గ్రామంలో వెంకట్రావు టీడీపీ కీలకమైన నేతగా వ్యవహరించారు.