Begin typing your search above and press return to search.

చిరంజీవికి సీఎం జగన్ అపాయింట్ ఎలా దక్కిందంటే!

By:  Tupaki Desk   |   11 Oct 2019 7:09 AM GMT
చిరంజీవికి సీఎం జగన్ అపాయింట్ ఎలా దక్కిందంటే!
X
చిరంజీవి కుటుంబానికి వైఎస్ కుటుంబాన్ని చాన్నాళ్లుగా అంత మంచి సంబంధాలు లేవు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాకా రాజకీయ విబేధాలు ఉంటే ఉండవచ్చు. అయితే ఆ తర్వాత చిరంజీవి కాంగ్రెస్ లో కి చేరాకా పలుసార్లు జగన్ మీద పరోక్షంగా విమర్శలు చేస్తూ వచ్చాడు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి జగన్ ఎమ్మెల్యేలను బయటకు తీసుకుపోతాడనే వార్తల నేపథ్యంలో చిరంజీవి తాము ప్రభుత్వాన్ని నిలబెడతామని ప్రకటించుకున్నారు.

చివరకు పార్టీని విలీనం చేసి రాజ్యసభ సభ్యత్వాన్ని - కేంద్రమంత్రి పదవిని పొందాడు చిరంజీవి. ఒక రాజ్యసభ సభ్యత్వం ముగిశాకా చిరంజీవి రాజకీయానికి శుభం కార్డుపడింది. సినిమాల్లోకి తిరిగివచ్చాడు. రీ ఎంట్రీలో చిరంజీవి కెరీర్ విజయవంతంగా సాగుతూ ఉంది.

ఇక రాజకీయాల్లో ఉన్నప్పుడు జగన్ మీద మెగా ఫ్యామిలీ పలు సార్లు అనుచితంగానే మాట్లాడింది. రామ్ చరణ్ కూడా అందుకు అతీతం కాదు. ఇక పవన్ కల్యాణ్ సంగతి సరేసరి. జగన్ ఎలా ముఖ్యమంత్రి అవుతాడో చూస్తా అంటూ మాట్లాడాడు. ఇప్పుడు అదే జగన్ అపాయింట్ మెంట్ కోసం చిరంజీవి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ ను చిరంజీవికి ఇంతకీ ఎవరు ఇప్పించారంటే.. అనేది ఆసక్తిదాయకమైన అంశం అవుతూ ఉంది.

జగన్ కు - చిరంజీవికి ఉన్న కామన్ ఫ్రెండ్ ఉన్నారు. అతడే నాగార్జున. జగన్ తో చాలా సన్నిహితంగా ఉంటారు నాగార్జున. ఇక చిరంజీవితో కూడా సన్నిహితంగానే ఉంటాడు. ఈ నేఫథ్యంలో నాగార్జున ద్వారా జగన్ ను చిరంజీవి సంప్రదించాడని.. దీంతో అపాయింట్ మెంట్ ఖరారు అయ్యిందని సమాచారం అందుతూ ఉంది.