Begin typing your search above and press return to search.
సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే.. డిసైడ్ చేసిన సోనియా
By: Tupaki Desk | 17 March 2021 3:53 AM GMTఒకటి తర్వాత ఒకటిగా జరుగుతున్న ఎన్నికల పరంపరలో మరో ఎన్నికకు సంబంధించిన కీలక నోటిఫికేషన్ విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈసీ జారీ చేయటం తెలిసిందే. ఏపీలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి.. తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో జరిగే సాగర్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిర్ణయించింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా అభ్యర్థిని ప్రకటించారు.
ముందు నుంచి అంచనా వేస్తున్నట్లే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి బరిలోకి దిగగా.. ఆయనపై పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సయ్య గెలుపొందారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో మరణించటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏప్రిల్ 17న ఈ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. ఫలితం మే 2న వెల్లడి కానుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న జానా.. తన సత్తా చాటనున్నారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.