Begin typing your search above and press return to search.

సాగర్ బరిలో 17 మందికి షాక్.. తుదకు నిలిచింది ఎంతమందంటే?

By:  Tupaki Desk   |   1 April 2021 7:06 AM GMT
సాగర్ బరిలో 17 మందికి షాక్.. తుదకు నిలిచింది ఎంతమందంటే?
X
తాజాగా జరుగుతున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన వైనం తెలిసిందే. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు.. కొందరు రెబెల్స్ తో పాటు.. స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 77 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. తాజాగా స్క్రూట్నీ పూర్తి చేశారు. వీరిలో నివేదిత రెడ్డితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి నామినేషన్లను రిజెక్టు చేవారు. వీరిద్దరితో పాటు మరో పదిహేను మంది స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో బరిలో 60 మంది అభ్యర్థులు నిలిచారు. ఇక ఉప ఎన్నికలో కీలకమైన పోలింగ్ ఈ నెల 17న జరగనుంది. కౌంటింగ్ మాత్రం మే 2న వెలువడనుంది. టీఆర్ఎస్ నుంచి నోముల భగత్.. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి.. బీజేపీ నుంచి రవినాయక్ లు నామినేషన్లు దాఖలు చేయటంతో పాటు.. ఎవరికి వారు జోరుగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థుల తరఫున ఏ పార్టీకి చెందిన నేతలు పలువురు ప్రచారాన్ని చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కోవిడ్ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గతానికి భిన్నంగా ప్రస్తుతం ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో 53 పోలింగ్ కేంద్రాల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక.. పోలింగ్ వేళలు సైతం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు. ఏడు గంటల సమయానికి క్యూలైన్లో ఉన్న వారందరికి ఓట్లు వేసే వీలు కల్పిస్తారు.