Begin typing your search above and press return to search.

రెండు ఎదురుదెబ్బలకే సారులో ఇంత మార్పు వస్తే.. సాగర్ లో ఓడిపోతే?

By:  Tupaki Desk   |   3 April 2021 2:30 AM GMT
రెండు ఎదురుదెబ్బలకే సారులో ఇంత మార్పు వస్తే.. సాగర్ లో ఓడిపోతే?
X
ఎన్నికలు ముంగిట్లోకి వచ్చినప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ.. తమకే ఓట్లు వేయాలని.. తమ అభ్యర్థిని గెలిపించాలని తెగ ప్రచారం చేస్తారు. తాజాగా తెలంగాణలో జరుగుతున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగానూ అలాంటి పరిస్థితే నెలకొంది. ఇటీవల గెలిచిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమా అని.. కేసీఆర్ ఇప్పుడు మాంచి ఖుషీలో ఉన్నారు. అంతకుముందు ఎదురైన రెండు ఎదురుదెబ్బలు (దుబ్బాక.. జీహెచ్ఎంసీ) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో పెద్ద ఎత్తున మార్పు రావటానికి కారణమైందని చెబుతారు.

తనకు తిరుగులేదన్న సారు ఆత్మవిశ్వాసాన్ని దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికలు దారుణంగా దెబ్బ తీశాయి. అదే సమయంలో బీజేపీ బలపడటం.. వారి పక్షాన కొన్ని పక్షాలు నిలవటంతో పాటు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు సమీక్రతం కావటం మొదలైంది. ఇదే.. గ్రేటర్ లో టీఆర్ఎస్ ఆశించిన సీట్లకు దూరంగా ఉన్నపరిస్థితి. దీంతో.. ఫాంహౌస్ లో వరుస పెట్టి భేటీలు జరపటం.. మేథోమధనం చేసిన ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు కోసం ఆయన భారీ కసరత్తు చేశారు.

అందుకు తగ్గట్లే రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇంతవరకు బాగానే ఉంది. రెండుక ఎదురుదెబ్బలకు రెండు విజయాలు. లెక్క సరిపోయినట్లే. కానీ.. అసలు కథ సాగర్ ఉప ఎన్నిక రూపంలో ఎదురైంది. అధికార పక్షంగా ఉన్న తమకు మాత్రమే ఓటు వేయాలని.. విపక్షాలకు ఓటు వేస్తే చీలిపోతుందని.. డెవలప్ మెంట్ పనులు పూర్తి కావని గులాబీ నేతలు అదే పనిగా ప్రచారం చేస్తున్నారు.అధికారపక్ష నేతల వ్యాఖ్యలకు విపక్ష నేతల వాదనలు మరోలా ఉన్నాయి.

సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడేళ్లు అవుతున్నా.. ఇప్పటికి పాలనా పరంగా కేసీఆర్ పట్టు సాధించలేదని.. ఒక విధానాన్ని పాటించటం లేదన్న విమర్శలు ఉన్నాయి. అందుకే.. తాజాగా జరుగుతున్న సాగర్ ఎన్నికల్లో సారుకు షాకిచ్చేలా తీర్పును ఇస్తే.. పాలన మీద మరింత జోరుగా పని చేస్తారని. ఆయనలో మార్పు కోసమైనా.. ఎన్నికల్లో ఓటమి చెందేలా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. మరి.. సాగర్ ఓటర్లు ఏ వాదన పట్ల ప్రభావానికి గురవుతారో చూడాలి.