Begin typing your search above and press return to search.

సాగర్ ప్రచారంలో లోకల్, నాన్ లోకల్ వార్

By:  Tupaki Desk   |   12 April 2021 11:30 PM GMT
సాగర్ ప్రచారంలో లోకల్, నాన్ లోకల్ వార్
X
ముందొచ్చిన చెవుల కన్నా.. వెనుకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టుగా తయారైందట నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ప్రచారం పరిస్థితి. ఇప్పుడక్కడ ప్రచారంలో లోకల్, నాన్ లోకల్ నేతల మధ్య పంచాయతీ ముదిరి పాకన పడుతోందట..

ప్రధాన పార్టీల తరుఫున ప్రచారానికి ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, నేతలు.. నియోజకవర్గంలో అన్నీ తామై వ్యవహరిస్తుండడంతో స్థానిక నేతలు అసహనానికి గురవుతున్నారట.. మా ఏరియాలో మీ పెత్తనం ఏంటని నిలదీస్తున్నారట..

సాగర్ పరిధిలోని గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలను పోలింగ్ బూత్ కే పరిమితం చేస్తున్న పార్టీలు ఇతర ప్రాంత్రాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, మంత్రులు, కీలక నేతలకు ఈ డబ్బు పంపిణీ నుంచి ప్రచారం, ఖర్చుల బాధ్యతలు అప్పగించారట..

దీంతో తమ గ్రామంలో వాళ్లు పంచుడేంది? మనల్ని పక్కన పెట్టడం ఏంటని లోకల్ నేతలు గుర్రుగా ఉన్నారట.. ఊళ్లో ఎవరికి పంచాలి? ఎవరితో ప్రచారం చేయాలన్నది ఆ గ్రామ సర్పంచ్ లు, ఎంపీటీసీలకే తెలుసు. కానీ ఇప్పుడు వారిని పక్కనపెట్టి ఇతర ప్రాంతాల నేతలు అన్నీ తామై వ్యవహరిస్తుండడంతో వీళ్లు జీర్ణించుకోవడం లేదట..

దీంతో పార్టీ అధిష్టానానికి దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే బయట నుంచి వచ్చిన వారికి ఒక వారం ఓ గ్రామంలో మరో వారం ఇంకో గ్రామంలో డ్యూటీలు వేస్తూ వారిని పక్కన పెట్టేస్తున్నారట..