Begin typing your search above and press return to search.

నీలాంటి కుక్కలను చాలా మందిని చూశా...మంత్రి జగదీశ్‌ ఆగ్రహం !

By:  Tupaki Desk   |   14 April 2021 6:34 AM GMT
నీలాంటి కుక్కలను చాలా మందిని చూశా...మంత్రి జగదీశ్‌ ఆగ్రహం !
X
నాగార్జునసాగర్ ఉపఎన్నిక రణరంగాన్ని తలపిస్తుంది. విజయం కోసం అన్ని పార్టీలు కూడా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి. టిఆర్ ఎస్ విజయం కోసం అన్ని ప్రణాళికలు రచిస్తుంది. ఇక కాంగ్రెస్, బీజేపీ కూడా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడే కొద్ది ప్రచారంలో అన్ని పార్టీల నేతలు కూడా జోరు చూపిస్తున్నారు. ఇక ఈ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం మంత్రి జగదీశ్ రెడ్డి నియోజకవర్గం లో ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో మంత్రి జగదీశ్ రెడ్డి కి నిరసన సెగ తగిలింది. అయన ప్రచారం చేస్తున్న సమయంలో మంత్రికి వ్యతిరేకంగా కొంత మంది నిరసన వ్యక్తం చేశారు. అనుముల మండలం కొత్తపల్లిలో ఓ ప్రైవేట్ టీచర్ నిరుద్యోగ భృతి, ఉద్యోగాలపై మంత్రిని నిలదీశారు.

వివరాల్లోకి వెళ్తే .. నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా అనుముల మండలం కొత్తపల్లిలో మంగళవారం మంత్రి మాట్లాడుతుండగా ప్రచార వాహనం వద్దకు అదే గ్రామానికి చెందిన నిరుద్యోగి అలుగుల అశోక్‌ రెడ్డి వచ్చి ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగభృతి హామీ ఏమైందని మంత్రిని ప్రశ్నించారు. దీనితో ఆగ్రహించిన మంత్రి నీలాంటి కుక్కలను చాలా మందిని చూశానని,కఠినంగా వ్యవహరిస్తామని ఫైర్ అయ్యారు. నిన్ను, నీ నాయకుణ్ని తొక్కిపడేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలాంటి వారిని చాలా మందిని చూశా.. నిన్ను ఎవరు పంపించారో తెలుసు. నీతో పాటు మీ నాయకులపై కూడా మేం కఠినంగా వ్యవహరిస్తాం’ అంటూ హెచ్చరించారు. దీనితో పోలీసులు అతన్ని అక్కడి నుండి పంపించివేశారు. ఆ తర్వాత మంత్రి ప్రచారం కొనసాగింది. ఇక ఎమ్మెస్సీ చేసిన అశోక్‌ రెడ్డి ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశాడు. లాక్‌ డౌన్‌ తర్వాత ఇంటికి వచ్చి పొలం పనులు చూసుకుంటున్నాడు.