Begin typing your search above and press return to search.
మాట ఇచ్చేసిన కేసీఆర్.. భగత్ గెలిస్తే.. ఆ నేతకు ఎమ్మెల్సీ పదవి
By: Tupaki Desk | 15 April 2021 4:33 AM GMTతెలంగాణ రాష్ట్రంలో రాజకీయ చాణుక్యం తెలిసిన అధినేతల్లో సీఎం కేసీఆర్ ముందుంటారు. సమయానికి అనుగుణంగా మాట్లాడటం.. ఎప్పుడేం మాట్లాడాలన్న అంశంపై ఆయనకున్నంత స్పష్టత మరే నేతకు ఉండదని చెప్పాలి. వరుసగా తగిలిన ఎదురుదెబ్బల తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల విజయాన్ని ఆయన కంటిన్యూ చేయాలన్న ఊపులో ఉన్నారు. ఇందులో భాగంగా తాజాగా జరుగుతున్న సాగర్ ఉప ఎన్నికను ఆయన చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం వెళ్లాల్సిన అవసరం ఏముందన్నట్లుగా ఉండే ఆయన..ఈసారి అందుకు భిన్నంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయటం తెలిసిందే.
ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. భగత్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరిన కేసీఆర్.. అతగాడి గెలుపు కోసం శ్రమిస్తున్న ఇద్దరు నేతల పేర్లను ప్రస్తావించారు. ఎంసీ కోటిరెడ్డి.. కడారి అంజయ్యలు బాగా పని చేస్తున్నారని కితాబు ఇచ్చేశారు. అంతేకాదు.. కోటిరెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. తాజాగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. భగత్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని.. కోటిరెడ్డిని ఎమ్మెల్సీని చేస్తానని చెప్పారు.
త్వరలో ఎమ్మెల్యేల కోటాలోనూ.. గవర్నర్ కోటాలోనూ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భగత్ విజయం సాధిస్తే.. కోటిరెడ్డి.. ఆ వెంటనే ఎమ్మెల్సీ అయిపోతారని చెప్పాలి. వన్ ప్లస్ వన్ ఆఫర్ అన్నట్లుగా.. ఎమ్మెల్యేగా భగత్ గెలిస్తే.. ఆ వెంటనే సారు చేతిలో ఉండే ఎమ్మెల్సీ పదవి కోటిరెడ్డికి దక్కుతుందని చెప్పాలి. ఎన్నికల ప్రచారంలో ముందున్న టీఆర్ఎస్.. తాజాగా గులాబీ బాస్ మాటతో కోటిరెడ్డి.. ధర్మారెడ్డిలు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారని చెప్పక తప్పు.