Begin typing your search above and press return to search.
నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్, బీజేపీకి బిగ్ షాక్
By: Tupaki Desk | 7 Jan 2021 10:51 AM GMTనాగార్జున సాగర్ ఉప ఎన్నిక చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయం సాగుతోంది. ఇప్పటికే దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి.. జీహెచ్ఎంసీలో హంగ్ రావడంతో బీజేపీ దూసుకొచ్చింది. బీజేపీ, టీఆర్ఎస్ లు ఇప్పుడు నాగార్జున సాగర్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్.. దుబ్బాకలో లాగే సత్తాచాటాలని బీజేపీ వ్యూహరచన చేస్తున్నాయి. ఇక గతంలో ఇక్కడ గెలిచిన జానారెడ్డి మరోసారి కాంగ్రెస్ తరుఫున నిలబడి గెలవాలని చూస్తున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డినే నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తుండగా ఆయన మాత్రం పోటీకి ససేమిరా అంటున్నారు. తనకు బదులుగా తన కుమారుడు రఘువీర్ రెడ్డిని బరిలోకి దించాలని జానారెడ్డి యోచిస్తున్నారనే వార్తలు వచ్చాయి.
అయితే పోటీ తీవ్రంగా ఉండడంతో జానారెడ్డి మనసు మార్చుకున్నట్టుగా సమాచారం. ఇప్పటికే నాగార్జునసాగర్ ముగిసే దాకా కొత్త పీసీసీ చీఫ్ ఎంపికను వాయిదా వేయాలని జానారెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పటికే సూచించారు.
ఇదే విషయాన్ని తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ కూడా ముఖ్య నేతలకు వివరించినట్టు సమాచారం.