Begin typing your search above and press return to search.

ఎగ్జిట్ పోల్స్ : సాగర్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ, బీజేపీ గల్లంతు?

By:  Tupaki Desk   |   29 April 2021 1:33 PM GMT
ఎగ్జిట్ పోల్స్ : సాగర్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ, బీజేపీ గల్లంతు?
X
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పార్టీలన్నీ ఎంత హోరాహోరీగా తలపడ్డాయో అందరికీ తెలిసిందే. గులాబీ దళపతి కేసీఆర్ కరోనాను లెక్కచేయకుండా ఇక్కడకు వచ్చి మరీ ప్రచారంచేశాడు. కరోనా బారినపడ్డారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమితో టీఆర్ఎస్ నాగార్జున సాగర్ పై దృష్టి సారించింది. కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించారు.

ఇక నాగార్జునసాగర్ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పెట్టని కోట. ఆయన సొంత నియోజకవర్గం కావడంతో టీఆర్ఎస్ ను కాంగ్రెస్ గట్టిగానే ఢీకొట్టింది.

ఇక బండి సంజయ్ దూకుడు కొనసాగించాడు. సాగర్ లో పదునైన ప్రచారాన్నే చేశాడు.అయితే ఓటర్లు మాత్రం టీఆర్ఎస్ కే పట్టం కట్టారని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బట్టి తెలుస్తోంది.

తాజాగా దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తాయి. నాగార్జున సాగర్ అసెంబ్లీలో ‘పబ్లిక్ పల్స్ ’ సర్వే బయటకొచ్చింది. ఇందులో టీఆర్ఎస్ పార్టీకి 48.5శాతం ఓట్ల శాతం దక్కుతుందని తేలింది. ఇక కాంగ్రెస్ పార్టీకి 43.8శాతం ఓట్లు వస్తాయని పబ్లిక్ పల్స్ తేల్చింది. బీజేపీకి మరీ తీసికట్టుగా కేవలం 4.5శాతం మాత్రమే వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 3.2శాతం ఓట్ల శాతం వస్తాయని తెలిపింది.

దీన్ని బట్టి నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ పార్టీ హోరాహోరీ పోరులో కాంగ్రెస్ తో తలపడి విజయం సాధిస్తుందని.. కాంగ్రెస్ సైతం గట్టి పోటీనిస్తుందని పబ్లిక్ పల్స్ సర్వే తేల్చింది.