Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ పార్టీ ఎంపీ - ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్!

By:  Tupaki Desk   |   24 Oct 2020 8:50 AM GMT
టీఆర్ ఎస్ పార్టీ ఎంపీ - ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్!
X
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ప్రతిరోజూ కూడా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు ఓకే రీతిలో నమోదు అవుతూనే ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా మహమ్మారి జోరుకి బ్రేకులు పడటం లేదు. సామాన్యుల నుండి ప్రముఖులు , విఐపిల వరకు అందరూ ఈ కరోనా భారిన పడుతున్నారు. ముఖ్యంగా కరోనా భారిన పడే ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కరోనా బారినపడగా, తాజాగా మరో అధికార టిఆర్ ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కూడా కరోనా సోకింది.

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. గత రెండ్రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనితో అయన హైదరాబాద్ ‌లో కరోనా నిర్దారణ పరీక్ష చేయించుకోగా, ఆ పరీక్షలో ఆయనకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోంక్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. తనకి కరోనా సోకిన విషయాన్ని తెలియజేసిన ఎమ్మెల్యే , తాను ఆరోగ్యంగానే ఉన్నానని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అలాగే గత వారం రోజులుగా తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఎవరికైనా కరోనా మహమ్మారి లక్షణాలు ఉంటే వెంటనే హాస్పిటల్ లో జాయిన్ కావాలని తెలిపారు.

అలాగే , నాగర్‌‌ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల ఎల్లూరు వద్ద కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపులు మునిగిన పరిస్థితిని పరిశీలించి వచ్చాక అస్వస్థతకు గురయ్యారు. పరీక్షలు నిర్వహించుకోగా ఎంపీకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,273 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని రిలీజ్ చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,30,274కి చేరింది. తాజాగా 1,708 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 2,09,034 మంది కరోనాను జయించినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. తాజాగా కరోనా కారణంగా ఐదుగురు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,303కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,937 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది.