Begin typing your search above and press return to search.

నాగశౌర్య ఫాంహౌస్ కేసు: ముగిసిన గుత్తాసుమన్ కస్టడీ.. ఏం తేలిందంటే?

By:  Tupaki Desk   |   5 Nov 2021 5:07 AM GMT
నాగశౌర్య ఫాంహౌస్ కేసు: ముగిసిన గుత్తాసుమన్ కస్టడీ.. ఏం తేలిందంటే?
X
టాలీవుడ్ హీరో నాగశౌర్యకు చెందిన ఫాంహౌస్ లో పేకాట కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చాలా మందిని అరెస్ట్ చేశారు. ఈ మంచిరేవుల ఫాంహౌస్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్ రెండు రోజుల కస్టడీ ముగిసింది. దీంతో పోలీసులు అతడిని ఉప్పర్ పల్లి కోర్టులో హాజరు పరిచారు. ఫాంహౌస్ పేకాట కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న పోలీసులు అతడిని చంచల్ గూడ జైలులో ఉంచి దర్యాప్తు చేశారు.

అయితే పోలీసుల విచారణలో గుత్తా సుమన్ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. అదే విధంగా సుమన్ లిస్ట్ లో ఉన్న పలువురు ప్రముఖుల లిస్ట్ చూసి పోలీసులు కంగుతిన్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో అతడికున్న సంబంధాలపై ఆరాతీసే ప్రయత్నం చేశారు. విచారణలో భాగంగా గతంలో సుమన్ నిర్వహించిన పార్టీకి సహకరించిన వారి వివరాలను రాబట్టారు.

అయితే ఈ కేసులో నాగశౌర్య, అతడి తండ్రి, బాబాయి గురించి సుమన్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదని తెలిసింది. దీంతో వారికి ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని తేలినట్టు సమాచారం.

గుంటూరు జిల్లాకు చెందిన గుత్తాసుమన్ రియల్టర్ గా, బిజినెస్ మ్యాన్ గా అవతారమెత్తాడు. అపార్ట్ మెంట్లు, విల్లాలు, కాంట్రాక్టుల పేరుతో పలువురిని మోసం చేసినట్లుగా విచారణలో తేలింది. ఇక మాంచిరేవుల పార్టీ తర్వాత 50 మందిని రష్యా క్యాసినోకి తీసుకెళ్లేందుకు కూడా సుమన్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

అయితే విచారణకు హాజరు కావాలని నార్సింగి పోలీసులు జారీ చేసిన నోటీసులకు హీరో నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ ఇంతవరకూ స్పందించారు. ఈ రోజు విచారణకు తుదిగడువు. ఈరోజు సాయంత్రంలోగా రవీంద్ర ప్రసాద్ విచారణకు హాజరు కాకపోతే వారెంట్ తప్పదని పోలీసులు చెబుతున్నారు.