Begin typing your search above and press return to search.
రోజాకు అవమానం తప్పదా ?
By: Tupaki Desk | 1 Oct 2021 2:30 AM GMTనగిరి ఎంఎల్ఏ ఆర్కే రోజాకు పరాభవం తప్పదా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. నియోజకవర్గంలోని నిండ్ర మండలం ప్రజా పరిషత్ అధ్యక్ష ఎంపిక విషయంలో తలెత్తిన వివాదం చివరకు బాగా పెద్దదైపోయింది. రోజాకు నిండ్రమండలంలో సీనియర్ నేత, శ్రీశైలం ట్రస్టు బోర్డు ఛైర్మన్ చక్రపాణిరెడ్డి, ఆయన సోదరుడు భాస్కరరెడ్డికి పడటంలేదు. దశాబ్దాలుగా నియోజకవర్గంలో చక్రపాణిరెడ్డి కుటుంబంకు పట్టుంది.
ఎంఎల్ఏపై అన్నీవర్గాల్లో వ్యతిరేకత వచ్చేసింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో రోజా గెలవదని చక్రపాణిరెడ్డి చెబుతున్నారు. అందుకనే తనకు టికెట్ ఇవ్వాలని చక్రపాణిరెడ్డి గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వరుసగా రెండు ఎన్నికల్లో రెడ్డికి టికెట్ ఇవ్వలేకపోయిన జగన్మోహన్ రెడ్డి తాజాగా శ్రీశైలం ట్రస్టుబోర్డు ఛైర్మన్ పదవిని ఇచ్చారు. దాంతో సోదరులు మరింత జోరుగా ఉన్నారు. ఈ నేపధ్యంలోనే పరిషత్ ఎన్నికలు జరిగింది.
ఇందులో మిగిలిన మండలాల సంగతి ఎలాగున్నా నిండ్రలో మాత్రం చక్రపాణిరెడ్డి వర్గీయులు మద్దతిచ్చిన వారే ఎక్కువమంది గెలిచారు. దాంతో ఎంపీటీసీలను ప్రమాణస్వీకారం చేయనీయకుండా రోజా పదే పదే అడ్డుకుంటున్నారు. తాను చెప్పిన వ్యక్తినే చక్రపాణిరెడ్డి వర్గం అధ్యక్షుడిగా అంగీకరించేవరకు ఎంపీటీసీల ప్రమాణస్వీకారాన్ని కూడా జరిగనిచ్చేది లేదని రోజా అడ్డుతగులుతున్నారు. అధికారపార్టీ ఎంఎల్ఏ అయ్యుండి, అధికారపార్టీ ఎంపీటీసీల ప్రమాణస్వీకారాన్ని అడ్డుకోవటమే విచిత్రంగా ఉంది.
మండల అధ్యక్షుని ఎంపిక వేరు, ప్రమాణస్వీకారం వేరని అధికారులు ఎంత చెప్పినా రోజా అసలు వినటమే లేదు. చక్రపాణిరెడ్డి వర్గీయులు ఎనిమిది ఎంపీటీసీలు ప్రమాణస్వీకారానికి రెడీ అయినా సాధ్యం కావటంలేదు. పైగా తనను ధిక్కరిస్తున్నారన్న కారణంతో చక్రపాణిరెడ్డి+ఆయన వర్గాన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సిందే అని రోజా పట్టుబట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి వాళ్ళ సస్పెన్షన్ కు రోజా లెటర్ ఇవ్వటమే విచిత్రంగా ఉంది.
జగన్ ఏరికోరి ట్రస్టుబోర్డు ఛైర్మన్ గా నియమించిన చక్రపాణిరెడ్డిని సోదరుడు భాస్కరరెడ్డి మద్దతుదారులను సస్పెండ్ చేయటం అయ్యేపనికాదు. దాంతో మంత్రికి ఏమి చేయాలో దిక్కుతోచటంలేదు. ఈ విషయాన్ని తెగేదాక లాగితే రోజాకే నష్టమని పార్టీలో ప్రచారం పెరిగిపోతోంది. ఈ కారణంతోనే వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ దక్కేది అనుమానమే అని ఒకవేళ తెచ్చుకున్నా గెలుపు కష్టమనే ప్రచారం ఊపందుకుంది. మరి తాజా వివాదం ఎలా ముగుస్తుందో చూడాల్సిందే.