Begin typing your search above and press return to search.
దయచేసి రాష్ట్రానికి రావొద్దు .. రూ.10 వేలు ఇస్తాం !
By: Tupaki Desk | 15 May 2020 11:30 AM GMTఇతర రాష్ట్రాలకి పనుల కోసం వెళ్లిన తమ రాష్ట్ర ప్రజలు ఈ కష్ట సమయంలో రాష్ట్రానికి రావొద్దు అని , మీరు ఉన్న చోటునే ఉండండి అని, ఆలా పనుల కోసం వలస వెళ్లి అక్కడే ఉండే వారికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆ కూలీలకు సాయంగా రూ.10 వేల చొప్పున ఇస్తామని నాగాలాండ్ ప్రభుత్వం తెలిపింది. లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్రం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లను నడుపుతోంది. వేలాది మంది వలస కూలీలు ఈ రైళ్ల ద్వారా సొంత రాష్ట్రాలకు చేరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో నాగాలాండ్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. వలస కార్మికుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నాగాలాండ్ కరోనా రహిత రాష్ట్రంగా ఉంది. ఈ నేపథ్యంలో వలస కూలీలు తిరిగి వస్తే కరోనా ఎక్కడ వ్యాప్తి చెందుతుందోనన్న ఆందోళనతో ఎక్కడి వారు అక్కడే ఉండేలా ఖర్చులు, ఇతర అవసరాల కోసం రూ. 10 వేల ఆర్థిక సాయం ప్రకటించింది. ఇతర రాష్ట్రాల నుంచి సొంత రాష్ట్రానికి వచ్చేందుకు దాదాపు 18 వేల మంది నాగాలాండ్ కూలీలు పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే, క్వారంటైన్ సదుపాయాలు, కరోనా పరీక్షలు చేసే కేంద్రాలు తగినన్ని లేకపోవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కూలీలను తిరిగి రావద్దని కోరుతోంది.
వలస వెళ్లిన వారు ఇప్పుడే రావాల్సిన అవసరం లేదని, ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వృద్ధులు, చికిత్స తీసుకుంటున్న రోగుల ఖర్చుల కోసం రూ. 10వేలు జమచేస్తామని, వారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఈ మొత్తాన్ని జమచేస్తున్నట్టు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి టెంజెన్ టోయ్ తెలిపారు.