Begin typing your search above and press return to search.

కుష్బూ వర్సెస్ నగ్మా

By:  Tupaki Desk   |   20 Feb 2016 4:27 AM GMT
కుష్బూ వర్సెస్ నగ్మా
X
తమిళనాట త్వరలో ఎన్నికలు జరగనుండగా.. అలనాటి నటీమణులు కుష్బూ, నగ్మా ఈ ఎన్నికల్లో సీటు కోసం పోటీ పడుతున్నారు. కుష్బూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగుతుండగా.. నగ్మా మాత్రం ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరు కూడా చెన్నై అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట. అయితే వీరిద్దరి లో కాంగ్రెస్ పార్టీ ఎవరికే టికెట్ కేటాయించాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మరోవైపు ఈ ఎన్నికల్లో ఏ నియోజక నియోజక వర్గం నుంచి కుష్బూ పోటీ చేయడం లేదని ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొనగా.. నగ్మా మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నారని తమిళ వర్గాలు అంటున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో.. ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇప్పటికే తమిళనాడు వ్యవహారాలు చూస్తున్న నగ్మాకు, అక్కడ కాంగ్రెస్ నాయకిగా పేరు తెచ్చుకున్న ఖుష్బూకు మధ్య చాలాకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో అది బాగా ముదిరిందని టాక్. అందం, ఆకర్షణలో ఒకరికి ఒకరు తీసిపోని ఈ వెటరన్ హీరోయిన్లు ఇప్పుడు రాజకీయాల్లోనూ తమ ఎత్తుకు పైఎత్తులతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. చివరికి ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.