Begin typing your search above and press return to search.
రాహుల్ గాంధీ జపం చేస్తున్న నగ్మా
By: Tupaki Desk | 15 Jan 2016 5:37 AM GMTకాంగ్రెస్ పార్టీ గ్లామర్ క్వీన్ నగ్మా రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేసి ఆయనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడులో పార్టీ వ్యవహారాలు చూస్తున్న ఆమె అక్కడి కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల సంస్కృతికి కళ్లెం వేసి రాహుల్ వద్ద మంచి మార్కలు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆమె మహిళా కాంగ్రెస్ లో గ్రూపులకు ఆస్కారం లేకుండా పనిచేయాలని... రాహుల్ ఆదేశాలకు కట్టుబడాల్సిందే.. అని మహిళా నేతలకు ఆ విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా హెచ్చరికలు జారీ చేశారు. మహిళా కాంగ్రెస్ లో నెలకొన్న వివాదాల్ని చక్కదిద్దేందుకు ఆమె రంగంలోకి దిగారు.
తమిళ కాంగ్రెస్ పార్టీలోవలే, మహిళా విభాగంలోనూ గ్రూపు రాజకీయాలు బయలు దేరిన విషయం తెలిసిందే. విజయధరణి అధ్యక్ష పగ్గాలు చేపట్టినానంతరం ఈ రాజకీయం మరింతగా వేడెక్కాయి. ఇక, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయధరణి ఏకంగా టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ను ఢీకొట్టడంతో వివాదం మరింతగా ముదిరింది. ఈ వ్యవహారాలు ఢిల్లీకి చేరి ఉండడంతో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు మహిళా విభాగం రాష్ర్ట ఇన్చార్జ్ , జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా రంగంలోకి దిగారు. మహిళా నాయకుల్ని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి, తామంతా ఒక్కటే అని చాటేందుకు తీవ్ర కుస్తీల్లో పడ్డారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి చెన్నైకు వచ్చిన నగ్మా మహిళా నేతలతో సమాలోచనలో పడ్డారు. మహిళా విభాగంలో సాగుతున్న గ్రూపుల్ని కట్టడి చేయడంతో పాటుగా, టీఎన్‌సీసీ వర్గాలతో ఏర్పడిన వివాదాన్ని చక్కబెట్టేందుకు కసరత్తుల్లో పడ్డారు.
ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించినా, మహిళా విభాగంలో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేసినా రాహుల్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరిస్తున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీ జపం చేస్తూ చిన్నబాబు కోటరీలో చేరేందుకు నగ్మా గట్టి ప్రయత్నాలే చేస్తోంది.