Begin typing your search above and press return to search.
ఈ రెస్టారెంట్ లో తినాలంటే అన్నీ వదిలేయాలి
By: Tupaki Desk | 9 Dec 2017 5:08 AM GMTచుట్టూ ఉండే ప్రపంచంలో చాలానే సిత్రాలు ఉంటాయి. పరికించి చూస్తే.. నిజమా అన్న అవాక్కు ఖాయం. ఇప్పుడు చెప్పబోయే రెస్టారెంట్ ఈ తరహాలోనిదే. దీని గురించి వింటే ఛీ.. అనాల్సిందే. సిగ్గు అన్నది పూర్తిగా వదిలేస్తే తప్పించి ఈ రెస్టారెంట్ లో తినలేని పరిస్థితి. ఇలాంటి రెస్టారెంట్ ఒకటి ఉంటుందని.. మీరు కలలో కూడా ఊహించని రీతిలో ఉంటుంది. ఇంతకీ ఆ రెస్టారెంట్ ఎక్కడ ఉంది? అంతలా ఊహించలేని రీతిలో అందులో ఏం ఉంటుంది? అన్నది చూస్తే..
ఫ్రాన్స్ లోని ఒక రెస్టారెంట్ అది. అందులో తినాలంటే ఒంటి మీద నూలుపోగు ఉండకూడదు. అందరూ న్యూడ్ గా ఉంటారు. ఓ నేచురల్ పేరుతో నడిచే ఈ హోటల్ రూల్స్ చాలా చిత్రంగా ఉంటాయి. దీన్ని మైక్.. స్టీఫెన్ అనే ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. ఇందులో భోజనం చేయటం కోసం చాలా రోజుల ముందే బుక్ చేసుకోవాలని చెబుతారు.
అంత డిమాండ్ ఉన్న ఈ హోటల్ రూల్స్ చాలా.. చాలా భిన్నం. ఇక్కడ తినేందుకు వచ్చే వారిని ముందు క్లోక్ రూంలోకి పంపుతారు. అక్కడ అతిధులు తమ దుస్తుల్ని విడిచేయాల్సి ఉంటుంది. చివరకు అండర్ గ్రార్మెంట్ తో సహా. ఆ తర్వాత కాగితంతో తయారు చేసిన చెప్పుల్ని వేసుకోనిస్తారు.
అప్పుడే వారికి రెస్టారెంట్ లోకి ఎంట్రీ ఇస్తారు. తమ రెస్టారెంట్ లో అశ్లీల కార్యకలాపాలకు పాల్పడకూడదన్న రూల్ ఉంటుందని.. దాన్ని పక్కాగా పాటిస్తామని చెబుతారు. ఈ తరహా రెస్టారెంట్ ఫ్రాన్స్ లో మాత్రమే కాదు.. టోక్యో.. మెల్ బోర్న్ లో కూడా ఉన్నాయట. ఎంత తినటం కోసమైతే మాత్రం.. మరీ అలానా..?