Begin typing your search above and press return to search.
ట్రంప్ ను అమ్మకానికి పెట్టారు
By: Tupaki Desk | 1 Sep 2016 12:35 PM GMTడొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ట్రంప్ ను కేరాఫ్ అడ్రస్ గా తీసుకునే స్థాయికి ఆయన గ్రాఫ్ పెరిగింది. అలాంటి ట్రంప్ ఇపుడు మరో రూపలో తెరమీదకు వచ్చారు. ఇటీవల న్యూయర్క్ నగరంలో ట్రంప్ కు చెందిన భారీ నగ్న విగ్రహాలు ఉంచిన సంగతి తెలిసిందే. భారీ పొట్ట - చిన్న వేళ్లు - మర్మాంగాలు లేని ఈ విగ్రహం ఆగస్ట్ నెల మొదట్లో పబ్లిగ్గా దర్శనమిచ్చాయి. అయితే శాంతి భద్రతల కోణంలో ఈ విగ్రహాల్లో చాలా వాటిని స్థానిక అధికారులు ముక్కలు చేశారు.అయితే ఈ విగ్రహాన్ని వేలం వేయనున్నారు.
అయితే లాస్ఏంజిల్స్‌లో ఉన్న ట్రంప్ విగ్రహం ఒక్కటే మిగిలింది. ఈ నగ్న విగ్రహానికి ద ఎంపరర్ హాజ్ నో బాల్స్ అని పేరు పెట్టారు. ఈ విగ్రహాన్ని అమ్మకానికి పెట్టారు. వేలంలో ఈ విగ్రహం పది వేల నుంచి 20 వేల డాలర్లకు అమ్ముడవుతుందని జూలియన్ ఆక్షన్స్ అంచనా వేస్తోంది. అక్టోబర్ 22న ఈ విగ్రహం వేలానికి రానుంది. వేలం ద్వారా వచ్చిన డబ్బులను వలస వాదుల హక్కుల కోసం పోరాడుతున్న గ్రూప్‌నకు అందజేయనున్నారు. వలసలను అడ్డుకునేందుకు అమెరికా, మెక్సికో మధ్య గోడ కడతానని అనడం, అమెరికాలో సరైన పత్రాలు లేకుండా ఉన్న లక్షలాది మందిని బయటకు పంపించేస్తానని ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో చెబుతూ వస్తున్నారు.అయితే ఈ విగ్రహం అమ్మకం ఎపిసోడ్ ట్రంప్ దృష్టిలో గౌరవమా? అవమానమా అనేది ఆయనే ప్రకటిస్తారో వేచిచూడాల్సిందే.