Begin typing your search above and press return to search.
తాను చావాలనుకుని..రెండు సింహాల్ని చంపించాడు
By: Tupaki Desk | 22 May 2016 9:25 AM GMTఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఎన్నో మార్గాలున్నాయి. కానీ అతను మాత్రం వెరైటీ మార్గాన్ని ఎంచుకున్నాడు. అనాలోచితమైన అతడి నిర్ణయం వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్న అతడి కోరిక నెరవేరలేదు. పైగా అనవసరంగా రెండు సింహాల్ని బలి తీసుకున్నాడు. చిలీలో జరిగిన ఈ సంఘంటన ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ సంఘటనకు సంబంధించిన విశేషాలేంటో చూద్దాం పదండి.
చిలీ దేశానికి చెందిన 20 ఏళ్ల యువకుడికి జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఐతే ఆత్మహత్యలోనూ థ్రిల్ ఉండాలనుకున్నాడో ఏంటో కానీ.. ఓ జూకు వెళ్లి అక్కడ సింహాల బోనులోకి దూకాడు. కానీ సింహాల చేతిలో చావాలన్న అతడి కోరిక నెరవేరలేదు. పాపం పొరబాటుగా సింహాల చేతికి చిక్కాడేమో అని ఆ జూ సిబ్బంది ఆ కుర్రాడిని కాపాడటానికి తమ ప్రయత్నం తాము చేశారు. రెండు సింహాలు అతడిపై దాడికి దిగుతున్న సమయంలో జూ సిబ్బంది అతణ్ని కాపాడటానికి సింహాలపై కాల్పులు జరిపారు. మామూలుగా సింహాల్ని అదుపులోకి తేవడానికి మత్తు మందు కలిగిన బాణాలు వదులుతారు. కానీ అవి అందుబాటులో లేకపోవడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. తూటాల దెబ్బకు రెండు సింహాలూ ప్రాణాలు వదిలాయి. పోనీలే అతడి ప్రాణాలైనా కాపాడాం అనుకున్నారు అధికారులు. తీవ్ర గాయాల పాలైన ఆ కుర్రాడిని ఆసుపత్రికి తరలించారు.
ఐతే ఆ కుర్రాడి వివరాలు తెలుసుకుందామని అతడి బట్టల్ని తీసుకుని జేబుల్లో వెతికితే ఆత్మహత్య లేఖ కనిపించింది. దీంతో జూ అధికారులకు దిమ్మదిరిగిపోయింది. అతను చేసిన పనికి అనవసరంగా రెండు సింహాల్ని చంపేశామే అనుకున్నారు. ఐతే ఆ కుర్రాడు కోలుకుని ప్రాణం విలువ తెలుసుకుంటే.. ఆ రెండు సింహాల ప్రాణ త్యాగానికి విలువుంటుంది.