Begin typing your search above and press return to search.
ముగ్గురు మరాఠీలు.. 150 మంది మహిళల నగ్న దృశ్యాలు.. ఏం జరిగింది?
By: Tupaki Desk | 5 Nov 2022 11:38 AM GMTతెలంగాణలో తీవ్ర సంచలన విషయం తెరమీదికి వచ్చింది. కేవలం ప్రధాన నగరాలకే పరిమితమైన హనీట్రాప్ విష సంస్కృతి ఇప్పుడు గద్వాల జిల్లాకు కూడా పాకింది. ఈ వ్యవహారంలో కీలక పాత్రధారులుగా ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన యువనాయకులు ఉన్నారన్న విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు యువ నాయకుల మధ్య నెలకొన్న విభేదాలతో ఏకంగా 150 మంది మహిళలకు సంబంధించిన నగ్న ఫొటోలు, వీడియోలు వెలుగు చూశాయి.
ఏం జరిగింది?తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన ముగ్గురు యువ నాయకులు కొంతకాలంగా కొందరు అమాయక మహిళలను లోబర్చుకుని వారితో వాట్సప్‌లో అశ్లీలంగా మాట్లాడడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు.
వీరంతా ఒకే గ్యాంగ్‌గా ఉంటూ లోబర్చుకున్న మహిళల అశ్లీల ఉన్న ఫొటోలు, వీడియోలను తమ ఫోన్లలో రికార్డు చేశారు. ఈ ముగ్గురు కూడా సదరు మహిళలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ముగ్గురు నాయకుల్లో ఒకరికి సంబంధించిన బంధువు మహిళ అశ్లీల ఫొటో కనిపించింది. దీంతో ముగ్గురి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి.
రెచ్చినపోయిన సదరు ముగ్గురు యువనాయకులు తమ వద్దనున్న మహిళల అశ్లీల ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగు చూడడంతో గద్వాల్‌లో కలకలం సృష్టించింది.
ఈ వీడియోలు వైరల్ కావడంతో సదరు యువ నాయకులు నష్టనివారణ చర్యలకు దిగారు. తమకున్న పలుకుబడితో నాయకుల శరణు కోరారు. విషయం పోలీసు కేసుల వరకు వెళ్లకుండా చూడాలని పైరవీలు చేశారు. కానీ, అప్పటికే పోలీసులకు చేరిపోయింది.
ఈ ఘటనపై జిల్లా పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న యువ నాయకుల కదలికలపై నిఘా ఉంచారు. ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లో వంద నుంచి 150 మంది మహిళల నగ్న ఫొటోలు, వివరాలు ఉన్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న ఇద్దరి నుంచి పూర్తి వివరాలను పోలీసులు తమదైన శైలిలో కూపీ లాగుతున్నారు. ఇదీ.. సంగతి!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.