Begin typing your search above and press return to search.

అమ్మాయికి 16, అబ్బాయికి 14 .. ప్రేమ పెళ్లి.. కోర్టు ఇచ్చిన తీర్పు ఇదే !

By:  Tupaki Desk   |   26 March 2021 11:30 AM GMT
అమ్మాయికి 16, అబ్బాయికి 14 .. ప్రేమ పెళ్లి.. కోర్టు ఇచ్చిన తీర్పు ఇదే !
X
ఇటీవల మైనార్టీ తీరకుండానే చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు యువత.. ప్రేమ అనే మత్తులో ఇలాంటి ఆలోచన చేస్తున్నారు. అమ్మానాన్నల మీద ఆధారపడి బ్రతకాల్సిన వయస్సులో అమ్మానాన్నలుగా మారిపోతున్నారు. ప్రేమ పేరుతో తిరగడం , ఆ తర్వాత పారిపోయి పెళ్లి చేసుకోవడం ఈ మద్యే ఇదో ట్రెండ్ గా మారిపోయింది. అయితే ఈ ఘటన లో ఆ అబ్బాయికి 14 ఏళ్ళు.. అమ్మాయికి 16 ఏళ్ళు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే మైనార్టీ తీరకుండా చేసుకున్న పెళ్లిళ్లు చెల్లవని, మన చట్టం లో ఉంది. అయితే వీరిద్దరి పెళ్లి విషయంలో మాత్రం ధర్మాసనం మానవతా దృక్పథంతో సంచలన తీర్పు ఇచ్చింది. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే .. బీహార్‌లోని నలంద జిల్లా కోర్టు మార్చి 20 ఒక విచిత్రమైన కేసుపై విచారణ చేసి తుది తీర్పు వెల్లడించింది. 14 ఏళ్ల బాలుడు, 16 ఏళ్ల బాలిక ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు 8నెలల బిడ్డకూడా ఉన్నాడు. ఈ విచిత్రమైన కేసు విచారణ సమయంలో కోర్టు మానవీయ కోణంలో ఆలోచించింది.ముగ్గురు జీవితాలు ఇందుకు ముడిపడి ఉన్నాయి కనుక తాము అది దృష్టిలో పెట్టుకుని తీర్పునిచ్చామని.. ఈ తీర్పుని ఏ రాష్ట్రంలోని కోర్టుని అనుసరించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో సరస్వతి పూజకు హాజరైన బాలిక తన ప్రియునితో కలిసి పారిపోయింది.దీంతో బాలిక తండ్రి అదే సమయంలో ఒక బాలునిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాడు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ మైనరు జంట తమను విడదీస్తారేమోనని భయపడి, ఢిల్లీకి పారిపోయారు. అక్కడ ఉండే బాలిక అత్త ఇంట్లో ఉన్నారు. అలా కొన్ని రోజులకు ఆ బాలిక గర్భవతి అయ్యింది. నెలలు నిండాక ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

ఇక కొన్ని రోజుల తర్వాత తన బిడ్డను తీసుకుని ఆ బాలిక సొంత ఊరికి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బాలుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపధ్యంలో కోర్టు మానవతా దృక్ఫథంతో కూడిన తీర్పునిచ్చింది. 16 ఏళ్ల బాలిక మరియు 14 ఏళ్ల బాలుడి వివాహం చట్టబద్ధమైన వివాహం అని తేల్చి చెప్పింది. జైలు శిక్ష అనుభవిస్తున్న అబ్బాయిని విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ 8 నెలల చిన్నారిని అతని తాత, నాయనమ్మల సంరక్షణలో ఉంచాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే ఈ మైనర్ జంటను డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ ‌లో ఉంచాలని. ప్రతీ ఆరు నెలలకు ఈ జంటకు సంబంధించిన రిపోర్టును సమర్పించాలని పోలీసులకు అధికారులకి ఆదేశాలు ఇచ్చింది.