Begin typing your search above and press return to search.
రేపటి నుంచి నా సత్తా ఏమిటో చూపిస్తా..
By: Tupaki Desk | 6 Nov 2021 10:39 AM GMTభువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైర్ బ్రాండ్ నాయకుడైన కోమటిరెడ్డికి ఇలాంటి వ్యాఖ్యలు సహజమే అయినా.. ఈసారి మరింత ఆసక్తికర అంశాలు మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం అనంతరం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన హుజూరాబాద్ ఫలితం తర్వాత రాష్ట్ర నాయకత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు.
తాజాగా మాట్లాడుతూ.. కామారెడ్డి- ఎల్లారెడ్డి నుంచి తన ఉద్యమాన్ని మొదలుపెడుతానని.. రేపటి నుంచి తన సంగతేంటో చూపిస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తన ప్రాణమని.. సోనియాగాంధీ తన దేవతని అన్నారు. తమ పార్టీ నేతలే ఒకప్పుడు సోనియాను దెయ్యం అని అన్నారని.. ఇప్పడు దేవత అంటున్నారంటూ పరోక్షంగా రేవంత్ పై సెటైర్ వేశారు. పెద్ద లీడర్లు అని చెప్పుకొని పదవుల పంపకాలు చేసుకున్నారంటూ మళ్లీ పార్టీ నాయకులపై అసంతృప్తిని వెళ్లగక్కారు. 72- 78 సీట్లు వస్తాయని మంత్రులు- ముఖ్యమంత్రి పదవిని పంపకాలు చేసుకున్నారంటూ ఆరోపించారు. తాను జిల్లా లీడర్ని అని.. వాళ్లంతా పెద్ద, గొప్ప స్థాయి లీడర్లు అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఏపీలో అసలు కాంగ్రెస్ లేదనుకుంటే 6 వేల ఓట్లు వచ్చాయని.. తెలంగాణలో ప్రభుత్వం వస్తదని చెప్పుకున్నా డిపాజిట్లే రాలేదంటూ హుజూరాబాద్ ఉప ఎన్నికను గురించి పేర్కొన్నారు. గెలుపు, ఓటములు సహజమని, రాజకీయాలను పక్కన పెట్టి కేసీఆర్ ను గద్దెదింపేందుకు, ప్రజల గురించి ఆలోచన చెయ్యాలన్నారు.
కేటీఆర్ సూటు బూటు వేసుకుంటే పెట్టుబడులు రావంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అభివృద్ధి వల్లే ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కేటీఆర్ ఎందుకు రైతుల గురించి వాళ్ళ కష్టాల గురించి మాట్లాడరంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుబంధు వల్ల ఎవరికి ఉపయోగం చేకూరిందంటూ విమర్శించారు. తమ ఛత్తీస్ఘఢ్ ముఖ్యమంత్రిని చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలంటూ కోమటిరెడ్డి సూచించారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బుజ్జగించేందుకు సీనియర్ నేత వి. హనుమంతరావు రంగంలోకి దిగారు. వీహెచ్ శనివారం కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ (సీఎల్పీ) కార్యాలయంలో కోమటిరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.