Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్ టిక్కెట్ల గోల ఓ ప్రాణం తీసింది
By: Tupaki Desk | 18 Sep 2018 2:08 PM GMTతెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి తారాస్థాయికి చేరిన సమయంలో మంచిర్యాల జిల్లా చెన్నూరులో కలకలం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా చెన్నూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును కాదని ఎంపీ బాల్క సుమన్ కు టికెట్ కేటాయించడంతో అసంతృప్తి మొదలైంది. అయినప్పటికీ సుమన్ ఆ నియోజకవర్గంలో ప్రచారానికి సిద్ధమయ్యారు. మంచిర్యాల జిల్లా ఇందారం దగ్గర ఎంపీ బాల్క సుమన్ ను అడ్డుకునేందుకు గ్రామస్తులు యత్నించారు. సుమన్ ప్రచారాన్ని అడ్డుకున్న ఓదెలు వర్గానికి చెందిన గట్టయ్య ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన గట్టయ్య నేడు కన్నుమూశాడు.
చెన్నూరు టిక్కెట్ ను బాల్క సుమన్ కు కాకుండా నల్లాల ఓదేలుకే ఇవ్వాలంటూ గట్టయ్య ఈ నెల 12న పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందారంలో బాల్క సుమన్ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో నల్లాల ఓదేలుకు అనుకూలంగా నినాదాలు చేస్తూ గట్టయ్య నిప్పంటిచుకున్నాడు. ఈ ఘటనలో మరో 19 మందికి కూడా కాలిన గాయాలయ్యాయి. గట్టయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గట్టయ్యకు చికిత్స అందించారు. అయితే..ఇవాళ పరిస్థితి విషమించటంతో గట్టయ్య మృతి చెందాడు.గట్టయ్య మృతితో ఇందారంలో విషాధచాయలు అలుముకున్నాయి. గట్టయ్యకు ఉస్మానియాలో పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తరలించనున్నారు.