Begin typing your search above and press return to search.
నా పేరు చెప్పి డబ్బులు దోచేస్తున్నారు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 26 Feb 2022 4:35 PM GMTనెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలకు కేంద్రం. గతంలోనూ ఆయన అనేక వ్యాఖ్యలు చేసి.. మీడియాలో ఉన్నారు. తాజాగా ఆయన తన పేరు చెప్పి.. వసూళ్లకుపాల్పడుతున్నారంటూ.. సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించారు. జిల్లాలోని విడవలూరు మండలంలో ఓ వైసీపీ నేత వసూళ్ల దందాను స్వయంగా ఆయన బయటపెట్టారు. ప్రభుత్వ భూములకు పట్టాలిప్పిస్తానంటూ తన పేరు చెప్పి.. డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.
సదరు వ్యక్తిని ప్రభుత్వ కార్యాలయాల గడప తొక్కనీయొద్దని..అధికారులకు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని పొన్నపూడి గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. స్థానిక వైసీపీ నేత తీరుపై(పేరు వెల్లడించలేదు) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరు చెప్పి.. డబ్బులు వసూళ్లు చేయమేంటని ధ్వజమెత్తారు. సదరు వ్యక్తిని ప్రభుత్వ కార్యాలయాల గడప తొక్కనీయొద్దని.. అధికారులకు స్పష్టం చేశారు.
ఇకనైనా ఆ వ్యక్తి తీరు మార్చుకోకపోతే.. పార్టీ నుంచి బహిష్కరిస్తామని ప్రసన్నకుమార్‌రెడ్డి హెచ్చరించారు. భూములకు పట్టాలంటూ నా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు. విడవలూరు మండలంలో వసూళ్లు సాగుతున్నాయి. ప్రతిపక్ష నాయకులు, రైతుల వద్ద రూ.లక్షలు వసూలు చేశారు. చాలాసార్లు మందలించినా తీరు మార్చుకోలేదు. నాకు, పార్టీకి చెడ్డపేరు తెస్తే క్షమించను. తీరు మార్చుకోకుంటే పార్టీ నుంచి బహిష్కరిస్తాం. అని ప్రసన్నకుమార్ హెచ్చరించారు.
ఎమ్మెల్యే పరోక్షంగా వైసీపీ నేతను హెచ్చరించడంతో.. ఆ వ్యక్తి ఎవరై ఉంటారా? అని స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తల్లో చర్చ మెుదలైంది. విడవలూరు వైసీపీ నేతలపై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఫైర్ అవడం.. స్తానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఎమ్మెల్యే పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న నేతల విషయం ఆయనకు తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నారనేది ప్రశ్న. పైగా జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల కోసం ఎవరూ డబ్బులు ఇవ్వరాదనేది నియమం. ఈ నియమాన్ని కూడా తుంగలో తొక్కుతున్న వారిని ఎమ్మెల్యే ఎందుకు ఉపేక్షిస్తున్నారనేది ప్రసన్న కుమార్ చుట్టూ వస్తున్న ప్రశ్నలు. దీని వెనుక ఏదో జరిగి ఉంటుందని.. అందుకే ఆయన ఇప్పుడు బయటపడ్డారని కొందరు విమర్శిస్తున్నారు.