Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నంగా మారిన నామా..సుజాత‌ల ఆడియో క్లిప్‌

By:  Tupaki Desk   |   29 Oct 2017 6:12 AM GMT
సంచ‌ల‌నంగా మారిన నామా..సుజాత‌ల ఆడియో క్లిప్‌
X
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావుపై ఒక మ‌హిళ చేసిన ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. త‌న న‌గ్న‌చిత్రాల్ని బ‌య‌ట‌పెడ‌తానంటూ నామా బెదిరిస్తున్నారంటూ పోలీస్టేష‌న్లో ఫిర్యాదు చేసిన సుజాత అనే మ‌హిళ ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

త‌న‌ను బెదిరిస్తున్నార‌ని నామాతో పాటు ఆయ‌న సోద‌రుడిపైనా ఆమె ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతం రాజ‌కీయంగానూ.. సామాన్య ప్ర‌జ‌ల్లోనూ తీవ్ర సంచ‌ల‌నంగా మారింది. క‌ర్ణాట‌క‌లోని ఒక ఎమ్మెల్సీ విష‌యంలోనూ నామా ఇదే తీరులో వ్య‌వ‌హ‌రించార‌ని.. అక్క‌డ కూడా కేసు న‌మోదైన‌ట్లుగా సుజాత వెల్ల‌డించారు.

నామా త‌న‌ను బెదిరిస్తున్న విష‌యాన్ని రెండు నెల‌ల క్రిత‌మే తాను పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా పోలీసులు ప‌ట్టించుకోలేద‌ని.. కొంద‌రు రాజ‌కీయ నేత‌లు త‌న‌ను బెదిరించిన‌ట్లుగా ఆమె ఆరోపించారు. కంప్లైంట్‌ ను వెన‌క్కి తీసుకోవాల‌న్న ఒత్తిడిని తెచ్చిన‌ట్లుగా పేర్కొన్నారు. మ‌హిళ‌ల్ని బెదిరించి లొంగ‌దీసుకునే నామా లాంటి నేత‌ల్ని చంద్ర‌బాబు ఎలా కొన‌సాగిస్తార‌ని ప్ర‌శ్నించారు. నామా లాంటి నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఇదిలా ఉంటే.. నామాకు త్వ‌ర‌లోనే నోటీసులు జారీ చేయ‌నున్న‌ట్లు పోలీసులు చెప్పారు. గ‌తంలో ఫిర్యాదు చేసినా.. ఆరోప‌ణ‌ల‌కు త‌గిన ఆధారాల్ని ఇవ్వ‌క‌పోవ‌టంతో కేసు న‌మోదు చేయ‌లేద‌న్న పోలీసులు.. తాజాగా మాత్రం కేసు న‌మోదు చేశారు. చ‌ట్ట‌ప్ర‌కారం నామాను విచారిస్తామ‌న్నారు. మాజీ ఎంపీపై ఆరోప‌ణ‌లు చేసిన సుజాత వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు.

త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై నామా రియాక్ట్ అయ్యారు. త‌న జీవితం తెరిచిన పుస్త‌క‌మ‌ని.. అన్ని విష‌యాలు అంద‌రికి తెలుస‌న్నారు. న‌లుగురికి సాయం చేయ‌ట‌మే కానీ బ్లాక్ మొయిల్ చేసే అల‌వాటు త‌న‌కు లేద‌న్న నామా.. సుజాత మీకు తెలుసా? అంటూ మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు మాత్రం బ‌దులివ్వ‌కుండా వెళ్లిపోయారు. ఇదిలా ఉండ‌గా.. త‌న‌తో నామా మాట్లాడిన మాట‌ల‌కు సంబంధించిన క్లిప్‌ల‌ను సుజాత విడుద‌ల చేశారు. ఇందులో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు ఉన్నాయి.నామా.. సుజాత‌ల మ‌ధ్య జ‌రిగిన‌ట్లుగా చెబుతున్న సంభాష‌ణ‌ల్ని చూస్తే..

సుజాత: ఎందుకు అరుస్తారు అసలు

నామా: సంబంధం లేదన్నాను. ఒకసారి చెప్పాను.. వందసార్లు చెప్పాను.. నువ్వు కావాలని చెప్పి చేయించి కాదంటావు.. ప్రామిస్‌ చేయమంటావు.

సుజాత: ఏమీ లేనప్పుడు ప్రామిస్‌ చేయడానికి ఏమైంది?

నామా: నువ్వెవరివే అసలు. నువ్వు నా గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు.. నా మీద కాన్ఫిడెన్స్‌ లేనప్పుడు నాతో మాట్లాడకు అని వందసార్లు చెప్పా. నాతో మాట్లాడకు. అంతే.. ఒకటే మాట. నువ్వు ఇంత చిల్లర (బూతు మాట).. కాబట్టి డ్రైవర్ల దగ్గర ఎంక్వైరీ చేయడమేనా.. ఇదేనా నీ పద్ధతి.

సుజాత: వాళ్లను అడిగితే లేని విషయాలు బయటకు వస్తాయా?

నామా: ఏంటే... నువ్వు చిల్లర... కాబట్టి కథలు అల్లుతున్నావే. రోజుకో కథ అల్లి దొబ్బుతున్నావు. దొంగ (బూతు) ఒకసారి చెప్తారు.. రెండుసార్లు చెప్తారు... రోజూ ఆట అయిపోయింది నీకు.. ఇది కాదే బ్లాక్‌మెయిల్‌?

సుజాత: ఎందుకు, నిజాన్ని అడగడం బ్లాక్‌మెయిలా?

నామా: నీ.....

సుజాత: నిజం అడిగితే బ్లాక్‌మెయిలా... నాకు చెప్పండి.. ప్రామిస్‌ చేస్తారా... లేదా?

నామా: ఈ మాట మాట్లాడకు. నాకు సంబంధం లేదని చెప్పాను.

సుజాత: అంటే.. లేనప్పుడు ఎందుకు ప్రామిస్‌ చేయవు?

నామా: (బూతు మాట) నాకు సంబంధం లేదంటే నీకేంటే ప్రామిస్‌ చేసేది... (బూతు మాట)

సుజాత: నువ్వెవరు నన్ను (బూతు మాట) అనడానికి

నామా: బూతుమాట

సుజాత: అంటే అది నిన్ను పెళ్లి చేసుకుందా. అది పతివ్రతా.. అంటే నువ్వు దానికి తాళి కట్టావు. అంతే కదా.. అందుకే కదా అది నిన్ను మొగుడు అని చెప్పుకుంటుంది.

నామా: పద్ధతి ప్రకారం మాట్లాడు

సుజాత: నేను పద్ధతి ప్రకారమే మాట్లాడుతున్నా. అది నిన్ను మొగుడు అని ఎందుకు చెప్పుకుంటుంది? నీ గురించి మాట్లాడినప్పుడు హస్బెండ్‌.. హస్బెండ్‌ అని ఎందుకు చెప్తోంది..

నామా: అది ఎవరో నాకు తెలియదు. దాంతో నువ్వు (బూతు మాట)... ఆ సంగతులు నాతో మాట్లాడకు. నువ్వు తప్పుడు (బూతు మాట) కాబట్టి అలా చేస్తున్నావు.

సుజాత: అవును.. మరి నువ్వేంటి... నువ్వేంటి?

నామా: అది చిల్లర (బూతు మాట) కాబట్టి నాకు సంబం«ధం లేని విషయం అది

సుజాత: అంటే అది నిన్ను మొగుడని చెప్పుకోవచ్చా?

నామా: ఈ విధంగా బ్లాక్‌మెయిల్‌ చేయడం

సుజాత: ఏంటి బ్లాక్‌ మెయిల్‌.... నువ్వు ఏమీ చేయనప్పుడు బ్లాక్‌మెయిల్‌ ఎందుకవుతుంది? నువ్వు ఏం తప్పు చేయనప్పుడు నీకు ఎందుకంత కోపం వస్తోంది?

నామా: మెస్సేజ్‌లు పెడతావు...బ్లాక్‌మెయిల్‌ చేస్తావు...

సుజాత: ఏం చేశాను.. ఏం ఫోటోలు పంపించాను.. ఏం పంపించాను

నామా: నా మాట మీద కాన్ఫిడెన్స్‌ లేనప్పుడు నాతో మాట్లాడకు. ఒకటే మాట.

సుజాత: అంటే నువ్వు దాంతో...?

నామా: ఏయ్‌.. పో... (బూతు మాట)

సుజాత: ఇవాళ మధ్యాహ్నం కూడా దానితో మాట్లాడావు.

నామా: నీ... (బూతు మాట) నాకు సంబంధం లేదని చెప్తున్నా.. పద్ధతిగా మాట్లాడు.

సుజాత: నేను ప్రూవ్‌ చేస్తే ఏం చేస్తావు ఇప్పుడు. ఇంతకుముందు ఒకసారి ఒప్పుకున్నావా లేదా దాంతో నీకుందని ఒప్పుకున్నావా లేదా?

నామా: నువ్వొక... చూడు... ఇక మొదలుపెట్టానంటే... నువ్వు తలెత్తుకోకుండా చేస్తా.. నువ్వు మాట్లాడుతున్నావు చెప్తున్నా..

సుజాత: ఓకే...

నామా: చిల్లర మాటలు మాట్లాడకు.. చెప్తున్నా..

సుజాత: ఓకే చెయ్యి..

నామా: ఏమనుకుంటున్నావో నువ్వు...

సుజాత: ఏం చేస్తావు... నన్ను తలెత్తుకోకుండా చేస్తానన్నావు.. ఏం చేస్తావు.

రెండో ఆడియో టేపులో..

నామా: నీకు నమ్మకం ఉంటే చెయ్యి... లేకపోతే లేదు.

సుజాత: నాకు నమ్మకం ఎలా ఉంటుంది... నీ మీద

నామా: పెట్టు

సుజాత: నువ్వు వాళ్లతో ఆడే డ్రామాలు వాళ్లతో ఆడుతున్నావ్‌... వాళ్లకేమో నా మీద పోలీస్‌ కంప్లైంట్‌ ఇవ్వమని చెప్తున్నావ్‌.

నామా: నువ్వు ఇదే మాట్లాడుతున్నావ్‌

సుజాత: సరే...నరేంద్ర నీకు తెలుసని ప్రూవ్‌ చేస్తే ఏం చేస్తావ్‌... జూలై నెలలో వాడు నీకు కాల్స్‌ చేశాడు.. నీవ్వు వాడితో మాట్లాడావని ప్రూవ్‌ చేస్తే ఏం చేస్తావ్‌?

నామా: తప్పు మాట్లాడుతున్నావ్‌. తప్పు మాట్లాడుతున్నావ్‌.

సుజాత: 2014 నీ కాల్స్‌ లిస్టు నా దగ్గర ఉందని నీకు తెలుసు కదా.

నామా: నువ్వు మొదలుపెట్టిందే మాట్లాడుతు న్నావ్‌.. ఇక దయచేసి నాకు ఫోన్‌ చెయ్యకు

సుజాత: ఓకే సరే అయితే

నామా: నువ్వు మారిపోతానంటే...

సుజాత: నువ్వు మారవా...

నామా: నువ్వు తప్పు మాట్లాడుతున్నావ్‌. వాళ్లతో మాట్లాడావ్, వీళ్లతో మాట్లాడావ్‌.. నాకు ఎవ్వరితో మాట్లాడే అవసరం లేదు.

సుజాత: అవునా... నువ్వు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నావ్‌. నీ పొలిటికల్‌ కెరియర్‌ కోసం నన్ను విత్‌డ్రా చేసుకోమంటున్నావ్‌. అంతేగానీ..

నామా: నా పొలిటికల్‌ కెరీర్‌ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నా పొలిటికల్‌ కెరీర్‌ గురించి నువ్వు అడగొద్దు. నా పొలిటికల్‌ కెరీర్‌ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. అర్థమైందా..?

సుజాత: నా పర్సనల్‌ లైఫ్‌ గురించి మాత్రం నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు



నామా: తప్పులు మాట్లాడుతున్నావ్‌.. ఛండాలంగా మాట్లాడుతున్నావ్‌

సుజాత: అవునా...

నామా: కావాలని మాట్లాడుతున్నావ్‌... కావాలని చేస్తున్నావ్‌.. సమస్యే లేదు. ఇలాంటి చిల్లర పనులు నేను చెయ్యను. చేయబోను. కేసు విత్‌ డ్రా చేసుకుని తర్వాత మాట్లాడు.
(ఇంతలోనే ఫోన్‌ కట్‌)