Begin typing your search above and press return to search.

సుడి అంటే నామాదే బాస్!

By:  Tupaki Desk   |   14 Jun 2019 5:59 AM GMT
సుడి అంటే నామాదే బాస్!
X
అదృష్టం అర‌చేతిలో పెట్టుకొని తిరుగుతుండే వారు కొంద‌రు క‌నిపిస్తుంటారు. అలాంటి నేత‌ల్లో టీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వ‌ర‌రావు పేరును అస్స‌లు మ‌ర్చిపోకూడ‌దు. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో గులాబీ బాస్ మ‌న‌సు దోచుకోవ‌ట‌మే కాదు.. ఆయ‌న న‌మ్మ‌కాన్ని సొంతం చేసుకోవ‌టంలో ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా అని చెప్పాలి. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో కేసీఆర్ కు స‌న్నిహితంగా మార‌ట‌మే కాదు.. కీల‌క ప‌ద‌విని చేజిక్కించుకోవ‌టం నామాకే సాధ్య‌మ‌వుతుంద‌ని చెప్పాలి.

ఇటీవ‌ల ముగిసిన లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన ఈ ఉదంతాన్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావిస్తే స‌బ‌బుగా ఉంటుంది. 2018 చివ‌ర్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన నామా నాగేశ్వ‌ర‌రావు ఓడిపోవ‌టం తెలిసిందే. తెలంగాణ‌లో తెలుగుదేశం ప‌ని అయిపోయింద‌న్న విష‌యాన్ని గుర్తించిన ఆయ‌న‌.. పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

రాయ‌బారంతో టీఆర్ ఎస్ లోకి చేరారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం ఎంపీగా త‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని కేసీఆర్ ను కోరారు. నామాను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌టానికి సైతం కేసీఆర్ ఒక‌ద‌శ‌లో ఇష్ట‌ప‌డ‌లేద‌ని చెబుతారు. అలాంటి గులాబీ బాస్ ను ఒప్పించి.. మెప్పించి.. టికెట్ ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితిని సృష్టించి మ‌రీ టీఆర్ఎస్ టికెట్ ను సొంతం చేసుకోగ‌లిగారు. అప్పుడే పార్టీలో వ‌చ్చిన నామాకు టికెట్ కేటాయిస్తే.. ఇబ్బంది అవుతుంద‌ని కేసీఆర్ భావించి.. ఆయ‌న టికెట్ ను క‌న్ఫ‌ర్మ్ చేయ‌టంలో జాప్యం చేశారు.

అయిన‌ప్ప‌టికీ వెన‌క్కి త‌గ్గ‌ని నామా.. ఏ రీతిలో కేసీఆర్ ను మెప్పించవ‌చ్చొ.. అదే రీతిలో ఆయ‌న మ‌న‌సు దోచుకొని మ‌రీ టికెట్ సొంతం చేసుకున్నారు. అక్క‌డితో ఆగితే ఫ‌ర్లేదు.తాజాగా లోక్ స‌భ టీఆర్ఎస్ ప‌క్ష నేత ప‌ద‌విని సొంతం చేసుకోవ‌టం ద్వారా.. కేసీఆర్ మ‌న‌సును నామా ఏ స్థాయిలో దోచుకున్నార‌న్న‌ది ఇట్టే అర్థం కాక మాన‌దు.

ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే..లోక్ స‌భ ఎంపీగా గెలిచిన నామా.. తాను ప్రాతినిధ్యం వ‌హించే పార్టీ త‌ర‌ఫు లోక్ స‌భ ప‌క్ష నేత‌గా ఎంపిక కావ‌టం విశేషం. పార్టీలో విధేయులు ఎంతోమంది ఉన్నా.. వారిని ప‌క్క‌న పెట్టి నామాకు బాధ్య‌త‌లు అప్ప‌గించిన తీరు చూస్తే.. అర్జెంట్ గా ఆయ‌న ద‌గ్గ‌ర కేసీఆర్ మ‌న‌సు దోచుకునే కిటుకు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.