Begin typing your search above and press return to search.
ప్లీజ్ నామా..ఇలా మాట్లాడితే మేం ఏమైపోవాలి?
By: Tupaki Desk | 3 Aug 2018 5:06 AM GMTచేతికి మైకు వస్తే చాలు.. చెలరేగిపోవటం నేతలకు మామూలే. నేతలంతా ఒకే తానులో ముక్కలే అయినా.. తెలుగు తమ్ముళ్ల తీరు మాత్రం కాస్త వేరుగా ఉంటుంది. తమకే మాత్రం సూట్ కాని విలువల గురించి.. ఆదర్శాల గురించి ఆ పార్టీ నేతల నోటి నుంచి వచ్చే మాటలు ఒక రేంజ్ లో ఉంటాయన్నది మర్చిపోకూడదు. ఆ మాత్రం మాటలు చెప్పని నేతలు ఏ పార్టీలో ఉంటారన్న దబాయింపు బాబును విపరీతంగా ఇష్టపడే కొందరు చేయొచ్చు కానీ.. తెలుగు తమ్ముళ్ల కొన్ని స్టేట్ మెంట్లు విన్నప్పుడు మాత్రం చిన్న చిన్న గుండెలు తట్టుకోలేవు సుమి.
తాజాగా అలాంటి తరహా స్టేట్ మెంట్ ఇచ్చి అవాక్కు అయ్యేలా చేశారు తెలంగాణ టీడీపీ మాజీ ఎంపీ.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన నామా.. ఎలాంటి వాడు.. ఆర్థికంగా ఆయన బ్యాక్ గ్రౌండ్ ఎలా ఉంటుంది? ఆయన రాజకీయాలు ఎలా ఉంటాయన్న విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరమే లేదు.
ఒకప్పుడు బాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన తర్వాత కాలంలో కాస్త వెనక్కి వెళ్లటం తెలిసిందే. నామా పేరు విన్నంతనే ఎవరికి వారికి ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు వద్దనుకున్నా చప్పున గుర్తుకు వస్తుంటాయి. మరి.. అలాంటి నేత నోటి నుంచి తాజాగా వచ్చిన మాటలు విన్నప్పుడు.. ప్లీజ్ నామా.. అలా మాట్లాడి మా వీక్ గుండెలకు ఏదో అయిపోయేలా చేయొద్దన్న భావన కలగటం ఖాయం.
ఇంతకీ.. నామా నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాల్లాంటి మాటలేమిటన్నది చూస్తే.. తానుడబ్బు సంపాదించటానికి రాజకీయాల్లోకి రాలేదని.. ప్రజాసేవ కోసం వచ్చానంటూ బరువైన మాటల్ని చెప్పుకొచ్చారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అంటిపెట్టుకొని కొనసాగుతున్న కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఇదే రీతిలో పలు విషయాల్ని చెప్పుకొచ్చారు. ఇన్ని మాటలు చెప్పిన నామాకు సంబంధించి.. ఆయన రాజకీయాల్లోకి వచ్చే వేళలో ఆయనకున్న ఆస్తుల విలువ ఏంటి? రాజకీయాల్లోకి వచ్చిన ఇన్నాళ్లకు ఆయన ఆస్తుల్లో వచ్చిన వ్యత్యాసం లెక్క చూస్తే.. నామా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు సుమి.