Begin typing your search above and press return to search.
పాలేరులో తుమ్మలకు పోటీగా నామా?
By: Tupaki Desk | 21 April 2016 7:49 AM GMTమరో మహా ఫైట్ కి వేదికగా ఖమ్మం జిల్లా మారుతుందా? అంటే అవునని చెప్పాలి. గతంలో ఒకే పార్టీలో ఉన్నప్పటికి ఉప్పు నిప్పులా ఉండే ఇద్దరు నేతల మధ్య రియల్ ఫైట్ కు తెర లేచే వీలుందన్న ఊహాగానాలు తెలంగాణ రాజకీయాల్లో ఊపందుకున్నాయి. సీనియర్ కాంగ్రెస్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో పాలేరు ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ అధికారపక్షం అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవటంతో ఈ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే తుమ్మల మీద పోటీకి తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నేత.. బాబుకు అత్యంత సన్నిహితుడైన నామా నాగేశ్వరరావును బరిలోకి దింపాలన్న ఆలోచనను తెలంగాణ తెలుగుదేశం చేస్తున్నట్లుగా వార్తలు జోరందుకున్నాయి. గతంలో ఈ ఇరువురు ఒకే పార్టీలో ఉన్నా.. రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించే వారు. వీరిద్దరి మధ్య అధిపత్య పోరు పార్టీలో ప్రముఖంగా కనిపించేది.
అలాంటిది ఈ ఇద్దరూ ముఖాముఖిన పోరుకి దిగితే పాలేరు ఉప ఎన్నిక రూపురేఖలు మారిపోతాయని.. ఇదో బిగ్ ఫైట్ గా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. నామాను టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థిగా ఎంపిక చేస్తారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తుమ్మలకు పోటీగా నామా కానీ రంగంలోకి దిగితే ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.