Begin typing your search above and press return to search.
తమ నాయకుడికి పదవి ఇవ్వాలని టవరెక్కారు
By: Tupaki Desk | 26 May 2016 12:32 PM GMTఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలయి దాదాపు వారం గడుస్తున్నప్పటికీ ఇంకా ఆ వార్తలు విశేషాల హడావుడి సద్దుమణగడం లేదు. తాజాగా పుదుచ్చేరిలో ఇదే తరహాలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో సీఎం గిరీ కోసం నెలకొన్న పోటీ విపరీత పోకడలకు దారితీస్తోంది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా నమశ్శివాయంను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆయన మద్దతుదారులు సెల్ ఫోన్ టవరెక్కారు. పుదుచ్చేరి కొంబాక్కంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొంబాక్కంకు చెందిన వీరపాండి - అశోక్ సహా మరో ముగ్గురు నేతలు కాంగ్రెస్ జెండా చేతపట్టుకుని స్థానికంగా ఉన్న ఓ సెల్ ఫోన్ టవరుపైకి ఎక్కారు.
నమశ్శివాయంను ముఖ్యమంత్రిగా ప్రకటించకుంటే టవరు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాదాపు గంటపాటు హైడ్రామా జరిగిన పోలీసులు అక్కడికి చేరుకుని చర్చలు జరిపి టవరుపై నుంచి ఎనిమిది మందిని కిందకు దిగివచ్చేలా చేశారు.