Begin typing your search above and press return to search.
నమస్తే.. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా మన ట్రెండ్
By: Tupaki Desk | 22 Aug 2020 7:00 AM ISTకరోనా దెబ్బకు పాశ్చాత్య సంస్కృతి ఎంత చెడ్డదో అందరికీ తెలిసింది. ముట్టుకుంటే అంటుకునే ఈ మహమ్మారి ధాటికి భారతీయుల సనాతన పద్ధతులు ఎంతో గొప్పవో కూడా తెలిసివచ్చాయి. అందుకే ఇప్పుడు విదేశీయులు హగ్గులు, కిస్సులు, హ్యాండులు ఇచ్చుకోకుండా మన భారతీయ ‘నమస్తే’ను చెప్పుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. వైరల్ అవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పలుదేశాల్లో రాజకీయ నేతల నుంచి బ్యూరోక్రాట్ల వరకు ప్రజలందరూ కూడా ‘నమస్తే’ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఇన్నాళ్లు భారతీయులు, నేతలు మాత్రమే పలకరించుకునే ఈ పద్ధతి ఇప్పుడు విశ్వవ్యాప్తం అయ్యింది. ప్రపంచానికి మార్గదర్శి అవుతోంది.
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం బయటపడుతోంది. దేశాధినేతలు క్వారంటైన్ విడిచి బయటకు వస్తున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ జనం బతకడం మొదలు పెట్టారు. పలకరించుకునే విధానంలో ఇప్పుడు భారీ మార్పులు వస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడికి వెల్ కంలాగా మోడీ నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ హిట్ అయ్యింది. ఇప్పుడు తాజాగా యూరోపియన్ దేశాలైన ఫ్రాన్స్,జర్మనీ అధినేతలు ఇమ్యానుయేల్, ఏంజెలా మోర్కల్ లు భేటి అయ్యారు. కరోనా కారణంగా వీరు సంప్రదాయ షేక్ హ్యాండ్ విధానాన్ని పక్కనపెట్టి మన ‘నమస్తే’తోనే పలకరించుకోవడం విశేషం. దక్షిణ ఫ్రాన్స్ లోని తన వేసవి విడిదిలో ఇమ్యానుయేల్ ఏర్పాటు చేసిన విందుకు మోర్కెల్ హాజరైన సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇది భారతీయతకు అనుకోని గుర్తింపును ఇచ్చింది.