Begin typing your search above and press return to search.
నారా లోకేష్ పాదయాత్ర పేరు.. ఇదే!
By: Tupaki Desk | 28 Dec 2022 5:33 AM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని తలపోస్తున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ ఏడాది మేలో నిర్వహించిన మహానాడు అంచనాలకు మించి విజయవంతమైంది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ప్రజలపై విధించిన అధిక ధరలకు నిరసనగా నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం కూడా సక్సెస్ అయ్యింది. అలాగే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం కూడా విజయవంతమైంది.
ఓవైపు నియోజకవర్గాల సమీక్షలతోపాటు ఆయా జిల్లాల్లో చంద్రబాబు సుడిగాడి పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు జనవరి నెలాఖరు నుంచి నారా లోకేష్ భారీ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. తన తండ్రి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేయనున్నారు.
మొత్తం 400 రోజులపాటు 4000 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన గతంలోనే టీడీపీ విడుదల చేసింది. మొత్తం వంద నియోజకవర్గాల గుండా లోకేష్ పాదయాత్ర సాగుతుందని చెబుతున్నారు. లోకేష్ 4000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయగలిగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక దూరం పాదయాత్ర చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టిస్తారు. తద్వారా వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్, వైఎస్ షర్మిలల రికార్డులు బ్రేక్ చేస్తారు.
కాగా నారా లోకేష్ పాదయాత్ర జనవరి 27 నుంచి చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ పాదయాత్రకు 'యువగళం' అని పేరు పెట్టినట్టు సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు సందడి చేస్తున్నారు. యువగళం పేరుతో నారా లోకేష్ ఉన్న ఫొటోలను పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
నారా లోకేష్ పాదయాత్ర ముఖ్యంగా యువత, రైతులు, కూలీలు, మహిళలు లక్ష్యంగా సాగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తన పాదయాత్రలో ఆయా వర్గాలతో లోకేష్ ప్రత్యేకంగా భేటీ అవుతారని అంటున్నారు.
కాగా నారా లోకేష్ పాదయాత్రకు సంబంధించి టీడీపీ అధికారిక ప్రకటన డిసెంబర్ 28న చేసే అవకాశం ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తదితరులు నారా లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్, పాదయాత్రకు పేరు ప్రకటించనున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ లోపుగానే టీడీపీ యూత్ వింగ్.. నారా లోకేష్ పాదయాత్ర పేరు యువగళం అని సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి వైరల్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.