Begin typing your search above and press return to search.
పక్కా 420 కంపెనీ 'ఎడ్కో'!
By: Tupaki Desk | 24 Oct 2018 10:16 AM GMTటీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ సంస్థలు - ఆఫీసులు - ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కానీ, ఆ సోదాలను కూడా దాడులుగా చిత్రీకరించి....టీడీపీ నేతలపై కేంద్రం కుట్ర పన్నిందని ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోంది. తమకో న్యాయం...పరులకో న్యాయం అన్న రీతిలో టీడీపీ అనుకూల మీడియా కథనాలు వండివారుస్తోంది. వేరే పార్టీ నాయకులపై సీబీఐ - ఐటీ సోదాలు జరిగితే...వారిని అవినీతిపరులని విమర్శించిన నేతలు...నేడు తమ దాకా వచ్చేసరికి కక్ష సాధింపు చర్యలని చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రమేష్ ఆస్తులు...ఆదాయపు పన్ను వ్యవహారాలకు సంబంధించి విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పనామా పేపర్ల తరహాలో షెల్ కంపెనీలతో రమేష్ వేల కోట్లు అర్జించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వాస్తవానికి రిజిస్ట్రేషన్ కూడా చేయకుండా ఏ కంపెనీని ప్రారంభించకూడదు. అటువంటిది సీఎం రమేష్ ఏకంగా `ఎడ్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్` పేరతో షెల్ కంపెనీ సృష్టించారు. ఆ కంపెనీ పేరుతో కోట్ల రూపాయల బిల్లుల్ని కూడా చెల్లించి లావాదేవీలు జరిపారు. రమేష్ కు చెందిన `రిత్విక్ ప్రాజెక్ట్స్`... కొన్ని కోట్ల రూపాయల బిల్లుల్ని ‘ఎడ్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే సబ్ కాంట్రాక్టర్ కు చెల్లించినట్లు ఐటీ అధికారులకు చూపింది. కానీ, ఈ కంపెనీయే లేదని ఆర్ ఓసీ అధికారులు స్పష్టం చేశారు. ఇంకా చెప్పాలంటే ఇలా చేయడం చీటింగ్. ఒకవేళ 420 కింద కేసు పెడితే... ఆ విచారణలో తాము కూడా భాగం కావాల్సి వస్తుందేమోనని, సాక్షాత్తూ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ ఓసీ) అధికారులే చెబుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిని బట్టి రమేష్ `420`కంపెనీలను సృష్టించి లావాదేవీలు జరిపారని ఆరోపణలు వస్తున్నాయి.
వాస్తవానికి `ఎడ్కో`ఆదాయాలపై ఐటీ శాఖ 2014లోనే అనుమానాలు వ్యక్తం చేసింది. తాజాగా, ఐటీ శాఖ జరిపిన దాడుల్లో ఎడ్కో కు రిత్విక్ కు ఉన్న లింక్ బట్టబయలైంది. ఒక్క ఎడ్కోనే కాదు....రిత్విక్ నుంచి కోట్ల రూపాయల విలువ చేసే సబ్–కాంట్రాక్ట్ పనులు తీసుకున్న కంపెనీల్లో కొన్ని కార్యకలాపాలు నిలిపి వేశాయి. ఎపుడో మూసేసిన ఏఏకే స్టీల్స్ నుంచి 25 కోట్ల స్టీల్ ను రిత్విక్ కొనుగోలు చేసిందట.
ఇక రిత్విక్ ప్రాజెక్ట్స్ సబ్–కాంట్రాక్ట్ పనులను నామినీగా చూపించి పలు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్‌ల నుంచి `ఎడ్కో` ఇబ్బడిముబ్బడిగా అప్పులు తీసుకుందని ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ (ఐసీఎల్ఎస్) అధికారులు అనుమానిస్తున్నారు. ఎడ్కో కంపెనీ స్టాంపులు, సీలు ఇతరత్రాలు రిత్విక్ అకౌంటెంట్ సాయిబాబా దగ్గర దొరకటం ఎడ్కో డొల్లతనాన్ని బయటపెడుతోంది. 2009–10 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి రూ.3.72 కోట్ల ఆదాయంపై ఎడ్కో దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ పై అధికారులు స్క్రూటినీ చేశారు. బిల్లులు, వోచర్లు లేకపోవడంతో ఆ ఆదాయాన్నిరూ.5.57 కోట్లుగా ఐటీ శాఖ పరిగణించింది. ప్రస్తుతం ఆ కేసు ఐటీ ట్రిబ్యునల్‌లో కొనసాగుతోంది.