Begin typing your search above and press return to search.

తమిళనాట ‘పేర్ల’ ట్రెండ్ కాస్త వేరు

By:  Tupaki Desk   |   29 Dec 2015 8:30 AM IST
తమిళనాట ‘పేర్ల’ ట్రెండ్ కాస్త వేరు
X
మారుతున్న రోజులకు తగినట్లుగా పెట్టే పేర్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలోతమ కులానికి.. మతానికి దగ్గరగా ఉండే పేర్లు పెట్టుకునే వారు. వారికి పెట్టిన పేర్లతో ఎవరు.. ఏ కులం.. ఏ మతం.. ఏ ప్రాంతానికి చెందిన వారన్న విషయం ఇట్టే తెలిసిపోయేది. తర్వాతి రోజుల్లో కాస్త ఆధునికంగా ఉండే పేర్లు వాడుకలోకి వచ్చాయి. మధ్య మధ్యలో పురాణాలు.. ఇతిహాసాలు.. కావ్యాల్లోని పేర్లను పెట్టే ట్రెండ్ నడిస్తోంది. ఆ మద్యలో ప్రాశ్చాత్య దేశాలు.. ఉద్యమ నేపథ్యంలో ఉద్యమనేతల పేర్లు పెట్టుకునే వారు. మరికొందరు అయితే తాము ఎంతగానో అభిమానించి.. ఆరాధించే వివిధ రంగాలకు చెందిన మహనీయుల పేర్లు పెడుతుంటారు.

ఇలా పేర్ల విషయంలో ఏ కాలానికి తగినట్లుగా ఆ కాలానికి కొన్ని పేర్లు నడిచేవి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తమిళనాడులో మాత్రం కాస్తంత చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడి వారికి తమిళనాడు ప్రాంతం అంటే ఎంతో అభిమానం. తమిళం.. తమిళనాడు అన్న పేరుతో ఉన్న పేర్లను పెట్టుకోవటానికి విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. ఇక.. తమిళనాడుకు చెందిన మరికొందరైతే.. మరో అడుగు ముందుకేసి.. చిత్రవిచిత్రమైన పేర్లను పెడుతూ షాకులిస్తున్నారు.

కలలో కూడా ఊహించని పేర్లను పెడుతూ తమిళ ప్రజలు పలువురికి షాకులిస్తున్నారు. ఇలాంటి కొన్ని పేర్ల విషయానికి వస్తే.. తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లా కొత్త మంగళానికి చెందిన రచయిత ఎం.ఎం.కన్నన్ తన కుమార్తె పేరును కంప్యూటర్ గా పెట్టుకున్నారు. ఆయన తన కుమార్తె స్కూల్ ఆడ్మిషన్ కు వెళ్లినప్పుడు కాస్తంత ఇబ్బంది పడుతూ.. ఇబ్బంది పెడుతుంటారు. ఇదే తరహాలో.. ఇంటర్నెట్.. ప్రోటాన్.. ఎలక్ట్రాన్.. న్యూట్రాన్ లాంటి పేర్లుపెడుతూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

ఇక.. తమిళ ప్రాంతానికి చెందినట్లుగా ఉండే మరికొన్నిపేర్లు చూస్తే..
= కనిమొళి (మృదుభాషి)
= తని తమిళ కొట్రన్ (స్వచ్చ తమిళ రాజు)
= తని తమిళనాడు (స్వచ్ఛ తమిళ దేశం)
= ఓ దర్జీ (టైలర్)
= జాతి ఒళిప్పు (జాతి నిర్మూలన)