Begin typing your search above and press return to search.

లైంగిక కేసులో 30 ఏళ్ల జైలు శిక్ష... నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

By:  Tupaki Desk   |   4 Aug 2021 6:30 AM GMT
లైంగిక కేసులో 30 ఏళ్ల జైలు శిక్ష... నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
X
హైదరాబాద్‌ లోని నాంపల్లి కోర్టు తాజాగా సంచలన తీర్పును ఇచ్చింది. బాలికను హత్యాచారం చేశాడన్న కేసులో ఓ హోంగార్డుకు ఏకంగా 30 ఏళ్లు జైలు శిక్షను విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు బాధితురాలి కుటుంబానికి 40 వేల రూపాయలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2021 ఫిబ్రవరిలో తుకారం గేట్‌ లో మైనర్‌ బాలికపై లైంగిక దాడికి దిగాడని హోం గార్డ్‌ మల్లికార్జున్‌ పై కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మల్లి కార్జున్‌ ను పోలీసులు ఫిబ్రవరి 19న అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ మొదలి పెట్టిన పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.

ఫిబ్రవరి 19న హోంగార్డు మల్లికార్జున్‌ ను అరెస్ట్‌ చేశారు. అనంతరం బాలిక గర్భం దాల్చడంతో.. మెడికల్‌ రిపోర్ట్స్‌ నుంచి ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌ వరకు.. అన్ని ఆధారాలు సేకరించారు. వాటిని కోర్టులో సమర్పించారు. తాజాగా మంగళవారం ఆధారలన్నింటినీ పోలీసులు కోర్టులో సమర్పించారు. కేసు విచారణ చేపట్టిన కోర్టు సాక్ష్యాలన్నీ ఉండడంతో ఆ అఘాయిత్యానికి ఒడిగట్టింది మల్లికార్జున్‌ అని నిర్ధారణకు వచ్చారు.

ఈ ఏడాదితో ఫిబ్రవరిలో తమ కూతురిపై హోంగార్డ్ మల్లికార్జున్ లైంగిక దాడికి పాల్పడ్డాడని తుకారాంగేట్ కి చెందిన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను వైద్యపరీక్షలు చేయించారు. రిపోర్ట్స్ లో బాలిక గర్భం దాల్చినట్లు వెల్లడైంది. మెడికల్‌ రిపోర్ట్స్‌ నుంచి ఎఫ్‌ ఎస్‌ ఎల్‌ రిపోర్ట్‌ వరకు అన్ని ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన నాంపల్లి న్యాయస్థానం నిందితుడు మల్లికార్జున్ కు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ ఆధారాలు అన్నింటిని కోర్టు పరిశీలించింది. నిందితుడు మల్లికార్జున్‌ కు 30 ఏళ్ల జైలుశిక్ష విధించింది. బాధితురాలి కుటుంబానికి రూ.40 వేలు చెల్లించాలని ఆదేశించింది. పోలీస్ శాఖలో పనిచేస్తూ, ఇలా చేయడంపై ఆగ్రహాం వ్యక్తం అయ్యింది. పోలీస్ పేరుతో ఏం చేసినా నడుస్తోందని అనుకుంటే చెల్లదు అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.