Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే రాజాసింగ్ కి ఏడాది జైలు శిక్ష .. ఎందుకంటే
By: Tupaki Desk | 29 Jan 2021 12:41 PM GMTనాంపల్లి స్పెషల్ కోర్ట్ గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు ఏడాది జైలు శిక్ష విదించింది. బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును విచారించిన నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆయనకు ఏడాది జైలు విధించింది. ఆయనకు ఆ తర్వాత బెయిల్ కూడా మంజూరు చేసింది. 2016వ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్ధులు బీఫ్ ఫెస్టివల్ చేసుకొబోతున్నారనే వార్తలపై రాజా సింగ్ చాలా తీవ్రంగా స్పందించారు. బీఫ్ ఫెస్టివల్ చేసుకున్నట్లయితే నా తడాఖా చూపిస్తాను. దాద్రీ సంఘటనలు హైదరాబాద్ లో కూడా చూడవలసి వస్తుంది అని హెచ్చరించారు.
ఆయనను అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై సెక్షన్ 295 ఏ కింద బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఐదేళ్ల తర్వాత ఈ కేసులో నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పు ప్రకటించింది. ఇక దీనిపై రాజా సింగ్ బెయిల్ పిటీషన్ దాఖలు చేయడంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తానని రాజా సింగ్ తెలిపారు.