Begin typing your search above and press return to search.
ప్రధాని మోడీని చితక్కొడతా.. ఒక్క కామెంట్.. తీవ్ర దుమారం
By: Tupaki Desk | 18 Jan 2022 2:53 PM GMT`ప్రధాని నరేంద్ర మోడీని చిత్తకొడతా.. నా ఇష్టం వచ్చినట్టు తిడతా!`- అంటూ.. కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అంతేకాదు.. జాతీయ రాజకీయాల్లో రచ్చ రచ్చ చేస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. ప్రధాని నరేంద్ర మోడీపై మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ శ్రేణులు తీవ్రస్థాయిలో రెచ్చిపోయాయి. ``ప్రధాని మోడీని నా ఇష్టం వచ్చినట్టు తిట్టగలను.. ఆయన్ను చితక్కొట్టగలను కూడా!`` అంటూ పటోల్ వ్యాఖ్యలు చేశారు.
ఇది.. బీజేపీ నేతల చెవిలో పడింది. వెంటనే వాళ్తు తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఇది కాస్తా వివాదం కావడంతో తాను మోడీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని.. స్థానిక గూండాను ప్రస్తావిస్తూ అలా మాట్లాడినట్లు నానా పటోలే చెప్పుకొచ్చారు. భండారా జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పటోలే.. ``నేను మోడీని ఓడించగలను.. ఆయన్ను తిట్టగలను అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. మోడీని టీవీల్లో చూస్తేనే ఒళ్లు రగిలిపోతోందని.. నేరుగా చూస్తే.. ఆయనను చితక్కొట్టేస్తానని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు మోడీ పెట్టింది పేరని దుయ్యబట్టారు. ఆయనను తిట్టడంలో తనకు ఎలాంటి జంకు లేదని అన్నారు.
అయితే.. పటోల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు షార్ప్‌గా రియాక్ట్ అయ్యారు. దీంతో పటోల్ యటర్న్ తీసుకున్నారు. 'నా నియోజకవర్గంలో మోడీ అనే గూండా గురించి ప్రజలు ఫిర్యాదు చేశారు. ఆ గూండా గురించే ఈ వ్యాఖ్యలు చేశాను' అంటూ పటోలే స్పష్టంచేశారు. ఇది ప్రధానిని ఉద్దేశించి కాదని తేల్చి చెప్పారు. పటోల్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయికి దిగజారడం విడ్డూరంగా ఉందంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. పటోల్ శారీరకంగానే ఎదిగారని.. మానసికంగా ఎదగలేదని ఎద్దేవా చేశారు.