Begin typing your search above and press return to search.
కాస్త జాగ్రత్త...మన దగ్గరా ఇలాంటోళ్లు ఉండొచ్చు
By: Tupaki Desk | 23 May 2015 1:41 PM GMTమహిళలకు తెలియకుండా వారి అర్ధనగ్న దృశ్యాలు చిత్రీకరిస్తున్న ఓ వ్యక్తిని సింగపూర్ పోలీసులు పట్టుకుని జైలుకు పంపించారు. భారత సంతతికి చెందిన నందకుమార్ (34) అనే వ్యక్తి సింగపూర్ లో నివసిస్తాడు... షాపింగు మాల్స్, రద్దీ ప్రాంతాల్లో మహిళల దేహాలను వారికి తెలియకుండా ఫొటోలు తీస్తూ దొరికిపోయాడు. ఇలా 60 మంది యువతులు, మహిళలు అర్దనగ్నంగా ఉన్న దృశ్యాలను ఇతను తన ఐ ఫోన్ లో చిత్రీకరించి వారి జీవితాలతో చెలగాటం ఆడుకున్నాడు.
నిత్యం చేతిలో ఒక బ్యాగు పెట్టుకునే ఇతను అందుతో పుస్తకాలు నింపి... దానిపై ఒక ఐఫోన్ ఏర్పాటుచేశాడు... బ్యాగు జిప్ పెట్టకుండా ఉంచి...ఐఫోన్ లో వీడియో మోడ్ ఆన్ చేస్తాడు. అది పట్టుకుని తిరుగుతూ ఎవరికీ తెలియకుండా మహిళల రహస్య భాగాలను వీడియో తీస్తుంటాడు. షాపింగ్ మాల్స్, బహిరంగ ప్రదేశాలలో మహిళల మధ్యే తిరుగుతూ వీడియోలు తీసేవాడు.
అయితే.... ఒక రోజు స్కర్టు వేసుకున్న ఒక మహిళ కుర్చీలో కూర్చోగా ఆమె కుర్చీ ఎదురుగా తన బ్యాగు ఉంచి ఏమీ తెలియనట్లు వేరే పనిలో నిమగ్నమయ్యాడు. కానీ, ఆమెకు ఇందులో ఏదో మతలబు ఉందని అనిపించి పరిశీలించి చూడగా బ్యాగులో వీడియో మోడ్ లో ఉన్న ఫోన్ కనిపించింది. దీంతో నందకుమార్ భండారమంతా బయటపడింది. పోలీసులకు కంప్లయింటు చేయడంతో వారు పరిశీలించగా ఐఫోన్ లో ఆ మహిళతో పాటు అనేక మందికి సంబంధించిన క్లిప్పింగులు ఉన్నాయి. దీంతో ఆయన్ను జైలుకు పంపించారు.
సింగపూర్ లోనే కాకుండా మన దగ్గరా ఇలాంటి ప్రబుద్ధులు ఉంటారు. షాపింగ్ మాల్స్ లోని ట్రయల్ రూంలలో, బాత్రూముల్లో రహస్య కెమేరాలు పెట్టేవారు... బస్సుల్లో, రద్దీ ప్రాంతాల్లో ఉన్నప్పుడు తెలియకుండా వీడియోలు, ఫొటోలు తీసేవారు ఉన్నారు. కాబట్టి.... ప్రధానంగా సెల్ ఫోన్ కెమేరాలతోనే ఇలాంటివి తీస్తుండడంతో ఎక్కడున్నా సరే మహిళలు కాస్త అప్రమత్తంగా ఉండడం అవసరం.