Begin typing your search above and press return to search.
అంతా బాలయ్యే చేశాడు
By: Tupaki Desk | 13 March 2019 2:20 PM GMTముందుగా భీమిలి అన్నారు. తర్వాత విశాఖ నార్త్ అన్నారు. ఆ తర్వాత రెండూ కాదన్నారు. ఇలా లోకేష్ విషయంలో రోజుకో నియోజకవర్గం తెరపైకి వచ్చింది. చివరాఖరికి మంగళగిరి ఫిక్స్ చేశారు. అయితే దీని వెనక చంద్రబాబు మంత్రాంగం కంటే - బాలయ్య మొండి పట్టుదల ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
అవును.. ఈసారి తన అల్లుళ్లు ఇద్దరికీ సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారట బాలయ్య. పెద్ద అల్లుడు లోకేష్ స్వయానా తనకు కొడుకు కాబట్టి ఈ విషయంలో చంద్రబాబుకు తలనొప్పి లేదు. ఎటొచ్చి రెండో అల్లుడు భరత్ విషయంలోనే చంద్రబాబు - బాలయ్య మధ్య చాలా వ్యవహారం నడిచిందని చెప్పుకుంటారు. ఫైనల్ గా బాలయ్య మాటకు చంద్రబాబు తలొగ్గారని కూడా టాక్.
తాజా పరిణామాల నేపథ్యంలో భరత్ కు విశాఖపట్నం ఎంపీగా సీటు కేటాయించినట్టు తెలుస్తోంది. ఇదే జిల్లా నుంచి లోకేష్ ను కూడా బరిలోకి దించితే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో - ఆఖరి నిమిషంలో చంద్రబాబు చక్రం తిప్పి - మంగళగిరికి లోకేష్ ను షిఫ్ట్ చేసినట్టు చెబుతున్నారు. మొత్తానికి ఏదైతేనేం బాలయ్య తన పంతం నెగ్గించుకున్నట్టయింది.