Begin typing your search above and press return to search.
వైఎస్సార్సీపీ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాం: నందమూరి బాలకృష్ఱ
By: Tupaki Desk | 28 May 2022 12:00 AM GMTరాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు. అధికార పార్టీ కార్యకర్తల చేతిలో దాడులకు గురయిన టీడీపీ కార్యకర్తలను బాలయ్య పరామర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఆయన పర్యటించారు. కొద్ది రోజుల క్రితం చిలమత్తూరు మండలం కొడికొండ గ్రామంలో వైఎస్సార్సీపీ వర్గీయుల చేతిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తలను పరామర్శించడానికి బాలయ్య భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.
ఈ నేపథ్యంలో బాలకృష్ణను కొడికొండ చెక్ పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇలా ర్యాలీగా ఎక్కువమంది వెళ్తే గ్రామంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల బాలకృష్ణ పర్యటనకు అనుమతించబోమని చెప్పారు. దీంతో టీడీపీ నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.
ఇంతలో బాలకృష్ణ కలుగుజేసుకుని కొడికొండలో ఎలాంటి గొడవలు జరగనీయబోనని.. ఇందుకు తనది హామీ అని పోలీసులకు తెలిపారు. అయినా సరే పోలీసులు ఎక్కువ మందితో వెళ్లడానికి ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు. నాలుగు కార్ల వరకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. దీంతో బాలయ్య నాలుగు వాహనాలతో కొడికొండ చేరుకున్నారు.
కొడికొండలో వైఎస్సార్సీపీ వర్గీయుల చేతిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తలు బాలాజీ, మూర్తి, రవిలను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను, పిల్లలను ఆప్యాయంగా పలుకరించారు. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించేది టీడీపీయేనని.. వైఎస్సార్సీపీ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నేతల ఆగడాలకు బలవుతున్న తమ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అరాచక పాలన సాగిస్తోందని బాలకృష్ణ ధ్వజమెత్తారు. ఇందుకు ఆ పార్టీ ప్రతిఫలం పొందక తప్పదన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు, హత్యలు అధికమయ్యాయని వివరించారు. వైఎస్సార్సీపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో హిందూపురం అభివృద్ధి నీరుగారిందని తీవ్రంగా విమర్శించారు. పులివెందులలో బస్టాండ్ కట్టలేని సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీది రాక్షస పాలన అని ధ్వజమెత్తారు. కార్యకర్తలకు కష్టమొస్తే అర్ధరాత్రి అయినా తాను వస్తానని భరోసా ఇచ్చారు.
కాగా, బాలయ్య కొడికొండ నుంచి ఒంగోలులో టీడీపీ మహానాడుకు బయలుదేరి వెళ్లారు. ఇటీవల అఖండ సినిమాతో మంచి విజయం సాధించిన బాలయ్య మరో రెండు చిత్రాలకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా వస్తున్న ఓ చిత్రంలోనూ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో చిత్రంలోనూ బాలకృష్ణ నటించనున్నారు.