Begin typing your search above and press return to search.
బూతుల మంత్రి ఒళ్లు దగ్గరపెట్టుకోవాలిః నందమూరి చైతన్య కృష్
By: Tupaki Desk | 23 Jun 2021 9:30 AM GMTఏపీ మినిస్టర్ కొడాలి నాని ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని నందమూరి చైతన్య కృష్ణ అన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇదే పద్ధతి కొనసాగితే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
రాష్ట్రానికి మంత్రిగా ఉన్న వ్యక్తి.. నోటికి ఎంతమాట వస్తే అంత మాట అంటున్నారని, ఇది సరికాదని అన్నారు. నారా లోకేష్ పై ఉద్దేశపూర్వకంగానే ఎందుకూ పనికిరాడనే ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్, చంద్రబాబును విమర్శించే అర్హత కొడాలి నానికి ఉందా? అని ప్రశ్నించారు.
ఐటీ, గ్రామీణాభివృద్ధి మంత్రిగా లోకేష్ యువతకు ఉద్యోగాలు కల్పించారని అన్నారు. గ్రామాల్లో 12 వేల కిలోమీటర్ల మేర రహదారులు వేయించారని చెప్పారు. ఈ విధంగా ఎంతో సమర్థవంతంగా పనిచేసిన లోకేష్ పప్పు ఎలా అవుతారో చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని చెప్పుకొచ్చారు చైతన్య కృష్ణ. ఇక, చంద్రబాబు, లోకేష్ పై ఒక్క అవినీతి కేసు కూడా లేదని అన్నారు. రౌడీయిజం చంద్రబాబు ఇంటావంటా లేదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి వారిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కొడాలి నాని తీరు మార్చుకోవాలని, లేదంటే తాట తీస్తామని హెచ్చరించారు.