Begin typing your search above and press return to search.
ఏకమైన నందమూరి ఫ్యామిలీ.. బాబుకు దన్ను దొరికినట్టేనా?
By: Tupaki Desk | 20 Nov 2021 7:30 AM GMTసుదీర్ఘ విరామం తర్వాత.. నందమూరి కుటుంబం ఏకమైంది. తాజాగా అసెంబ్లీలో జరగిన రగడ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు భావోద్వేగానికి గురై.. కన్నీరు పెట్టుకున్నారు. నిజానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా..ఎన్ని అవమానాలు ఎదురైనా.. తన 40 ఏళ్ల జీవితంలో ఏనాడూ చుక్క కన్నీరు కార్చని చంద్రబాబు వైసీపీ మంత్రులు, నేతల వ్యాఖ్యలతో భోరున విలపించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ బాధకు గురిచేసింది. మేం చూసిన చంద్రబాబేనా. ఇప్పుడు భోరున విలపిస్తున్నారంటూ.. పార్టీలకు అతీతంగా.. సామాజిక వర్గాలకు అతీతంగా ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, అదేసమయంలో నందమూరి కుటుంబం నుంచి కూడా చంద్రబాబు మద్దతు లభించింది. నిన్న మొన్నటి వరకు రాజకీయ వైరంతో దూరంగా ఉన్న అన్నగారి కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రంగా స్పందించారు. తమ సోదరి.. భువనేశ్వరి గురించి తప్పుగా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. తామంతా కలిసే పెరిగామని.. తమ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. అదేవిధంగా దివంగత మాజీ మంత్రి, అన్నగారి కుమారుడు, నందమూరి హరికృష్ణ కుమార్తె, రాజకీయ నాయకురాలు.. నందమూరి సుహాసిని కూడా.. తీవ్రంగా స్పందించింది.
మావయ్యా.. మీకు మేం అండగా ఉంటాం! అంటూ.. సుహాసిని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రజలు కూడా మీతోనే ఉన్నారంటూ.. ఆమె పేర్కొంది. అదేవిధంగా నందమూరి కుటుంబం చంద్రబాబుకు జరిగిన అవమానం.. ఆయన కుటుంబాన్ని, ముఖ్యంగా ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని అవమానించేలా వ్యాఖ్యానించడాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై శనివారం(ఈరోజు) ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా భువనేశ్వరి గురించి వ్యాఖ్యలు చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు నందమూరి కుటుంబం రెడీ అయినట్టు తెలుస్తోంది.
ఇప్పటివరకు చంద్రబాబును కార్నర్ చేసినప్పటికీ..రాజకీయంగా ఇవి మామూలే అనుకున్న నందమూరి కుటుంబం ఎప్పుడూ.. పట్టించుకోలేదు. అదేసమయంలో ఇటీవల పార్టీ కార్యాలయంపై.. వైసీపీ నేతలు కొందరు దాడి చేసిన తర్వాత.. చంద్రబాబు దీక్ష చేసినసమయంలో ఒకరిద్దరు మాత్రమే నందమూరి కుటుంబం నుంచి హాజరయ్యారు. కానీ, ఇప్పుడుజరిగిన ఘటనతో దేశవిదేశాల్లో ఉన్న నందమూరి కుటుంబ సభ్యలు.. తీవ్రంగా స్పందించినట్టు సమాచారం. దీనిపై చర్చించి.. ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చే యోచనలో ఉన్నారని తెలిసింది. ఇదిలావుంటే, చంద్రబాబు వియ్యంకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలయ్య కూడా ఈ విషయంపై సీరియస్‌గా ఉన్నారని.. ఆయన స్వయంగా సీఎం జగన్ తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.