Begin typing your search above and press return to search.
వాళ్లకు సిగ్గూ లజ్జా ఉందా? జగన్ క్షమాపణ చెప్పాలి
By: Tupaki Desk | 20 Nov 2021 10:30 AM GMTనందమూరి జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. తన అత్త భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్లకు అసలు సిగ్గూ లజ్జా ఏమన్నా ఉందా అని ప్రశ్నించారు. విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "మా అత్త గురించి టీవీల్లో వార్తలు చూసి షాక్‌కు గురయ్యా. వంశీ, కొడాలి నాని మా అత్త భువనేశ్వరి గురించి నీచానికి నీచంగా మాట్లాడారు. వాళ్ల రాజకీయ లబ్ధి పొందడం కోసం మా అత్తను బలిపశువును చేస్తున్నారు. దీన్ని నేను ఖండిస్తున్నా. మా కుటుంబంలో ఆడవాళ్ల గురించి మీకు ఏం తెలుసు?
మా తాత ఎన్టీఆర్.. నాయనమ్మ బసవతారకం అందరినీ పద్ధతిగా పెంచారు. మా అత్తలు కట్టుబొట్టు చూస్తే తెలుగుంటి ఆడపడుచులా ఉంటారు. వీళ్లకు విలువలు నేర్పించారు. మా కుటుంబంలోని ఆడవాళ్లందరూ సంప్రదాయంగా ఉంటారు. వాళ్లను చూసి మేం నేర్చుకున్నాం. ఎవరితోనైనా చాలా మర్యాదగా మాట్లాడుతారు. అలాంటిది మా అత్త భువనేశ్వరి గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. మీ రాజకీయ లబ్ధి కోసం మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారు. మా తాత మహిళలకు ఎంతో గౌరవమిచ్చారు. ఆయన ఆడవాళ్ల కోసం ఎన్నో సినిమాలు తీశారు.
కానీ ఇప్పుడు మహిళలకు కనీస గౌరవం ఇవ్వకుండా సిగ్గూ లజ్జా లేకుండా వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతుంటే ఎవరైనా మహిళలు రాజకీయాల్లోకి వస్తారా? వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు జాగ్రత్త. సీఎం జగన్.. మీ నాయకులు నీచంగా మాట్లాడారు. మీరు దీనిపై స్పందించాలి. నానీని, వంశీని బర్తరఫ్ చేయాలి. జగన్ క్షమపణలు చెప్పాలి. ఆయన క్షమాపణల కోసం మేం ఎదురు చూస్తున్నాం" అని చైతన్య పేర్కొన్నాడు.
బాలకృష్ణ భార్య వసుంధర మాట్లాడుతూ.. మాకు చాలా బాధగా ఉంది. రామునికి సీత ఎలాగో చంద్రబాబుకు భువనేశ్వరి అలాగా. నందమూరి కుటుంబానికి భువనేశ్వరి శ్రీరామరక్ష. ఇలా మట్లాడిన వాళ్లందరికీ వాళ్ల ఇళ్లలోని ఆడవాళ్లే సమాధానం చెప్పాలన్నారు.