Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు గేమ్‌ లో ప‌దే ప‌దే నంద‌మూరి పావులు

By:  Tupaki Desk   |   15 Oct 2019 7:47 AM GMT
చంద్ర‌బాబు గేమ్‌ లో ప‌దే ప‌దే నంద‌మూరి పావులు
X
ఎవ‌రిని ? ఎక్క‌డ ? ఎలా ? ఎప్పుడు వాడుకోవాలో చంద్ర‌బాబుకు తెలిసినంత‌గా మ‌రెవ్వ‌రికి తెలియ‌దు. ఇక నంద‌మూరి ఫ్యామిలీని త‌న ఆట‌లో ఎప్పుడు పావులుగా వాడుకోవాలో తెలిసిన గొప్ప నేర్ప‌రి చంద్ర‌బాబు. ఈ విష‌యంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఆయ‌న‌కు ఆయ‌నే మేటి. ఇక నంద‌మూరి అనే పేరును అవ‌స‌రానికి వాడుకుంటూ వస్తోన్న చంద్ర‌బాబు మ‌రోసారి అదే బ్రాండ్‌ ను వాడుకునేందుకు రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది.

తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి గురించి ఎంత చెప్పుకున్నా చేసేదేం లేద‌న్న‌ది బాబుకు ఎప్పుడో అర్థ‌మైంది. అయినా హుజూర్‌ న‌గ‌ర్లో త‌మ పార్టీ అభ్య‌ర్థిగా చావా కిర‌ణ్మ‌యిని పోటీలో దించారు. ఇక ఉప ఎన్నిక‌ల ప్ర‌చారానికి మ‌రో వారం రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ ఉప ఎన్నిక‌ల్లో తెలుగుదేశం ఎలాగూ గెల‌వ‌దు... డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. అందుకే చంద్ర‌బాబు ఇప్పుడు మరోసారి నంద‌మూరి పావుల‌ను వాడుకుంటూ ఇక్క‌డ ప‌రువు కోసం పాకులాడుతున్నారు.

దివంగ‌త మాజీ మంత్రి - త‌న బావ‌మ‌రిది హ‌రికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసిని (బాబు అవ‌స‌రాన్ని బ‌ట్టి ఆమె అప్పుడ‌ప్పుడు నంద‌మూరి సుహాసినిగా కూడా మారిపోతుంటారు) ఇప్పుడు హుజూర్‌ న‌గ‌ర్ లో చావా కిర‌ణ్మ‌యి త‌ర‌పున ప్ర‌చారంలోకి దిగుతున్నారు. ఏడెనిమిది నెల‌ల క్రితం ఇంట్లో ఉన్న ఆమెను తీసుకొచ్చి కూక‌ట్‌ ప‌ల్లిలో పోటీ చేయించి ఓడ‌గొట్టించారు. ఆ త‌ర్వాత ఆమెను ప‌ట్టించుకున్న పాపాన పోలేదు.

ఇక ఇప్పుడు మ‌ళ్లీ నంద‌మూరి బ్రాండ్ వాడ‌దాం? అంటే బాబు మ‌న‌స్త‌త్వం తెలిసిన హ‌రికృష్ణ ఫ్యామిలీ ఆయ‌న్ను ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. ఇక ఇప్పుడు మ‌ళ్లీ సుహాసినిని రంగంలోకి దించుతున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు సుహాసిని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారని - సుహాసిని ప్రచారం చేయడం వల్ల మహిళల ఓటు బ్యాంకు పెరుగుతుందని టీటీడీపీ నేతలు భావిస్తున్నార‌ట‌.

కూక‌ట్‌ ప‌ల్లిలో హ‌రికృష్ణ మృతి త‌ర్వాత వ‌చ్చిన సానుభూతి నేప‌థ్యంలో క‌మ్మ వ‌ర్గం ఓట‌ర్ల చేతే తిర‌స్క‌ర‌ణ‌కు గురైన సుహాసిని హుజూర్‌ న‌గ‌ర్ వ‌చ్చి ప్ర‌చారం చేస్తే ఓట్లేస్తారా... ! అన్న‌ట్టు బాల‌య్య కూడా అక్క‌డ నేడో రేపో ప్ర‌చారానికి దిగుతున్నాడ‌ట‌. చంద్ర‌బాబు నంద‌మూరి బ్రాండ్‌ ను అవ‌సరానికి వాడుకుంటూ ఎన్నేళ్లైనా రాజ‌కీయం చేస్తాడు.. అవ‌స‌రం తీరాక వాళ్ల మాటే ఎత్త‌డు అనేందుకు ఇది ఓ నిద‌ర్శ‌నం.