Begin typing your search above and press return to search.
తెలంగాణ..టీడీపీకి గట్టి షాక్ - సుహాసినికి ఓటర్ల ఝలక్!
By: Tupaki Desk | 11 Dec 2018 5:36 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో.. మహాకూటమిగా ఎన్నికలకు వెళ్లిన తెలుగుదేశం చిత్తు అవుతోంది. మొత్తం పన్నెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయగా.. ఒకటీ రెండు స్థానాల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు ఉనికి చాటుతున్నారు. సత్తుపల్లితో సండ్ర కాస్త ఆధికత్యను కనబరచగా - ఉప్పల్ లో టీడీపీ అభ్యర్థి ఉనికి కనిపిస్తోంది. వాటిని మినహాయిస్తే.. తెలుగుదేశం పార్టీ మిగతా చోట్ల వెనుకబడి ఉంది.
తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో నిలిచిన ప్రతిష్టాత్మక అభ్యర్థి నందమూరి సుహాసిని కూడా వెనుకంజలో ఉండటం విశేషం. తొలి రోండ్లోనే ఆమె వెనుకబడ్డారు. ఆ తర్వాతి రౌండ్స్ లో కూడా ఆమెపై తెరాస అభ్యర్థి ఆధికత్యను కనబరుస్తూ ఉన్నారు. నందమూరి సుహాసినిని అక్కడ రంగంలోకి దించడం చంద్రబాబు నాయుడి ఆలోచనే. అదేదో చాణక్య వ్యూహం అన్నట్టుగా చెప్పుకున్నారు.
అయితే ఇప్పుడు ఆమె ట్రయల్ లో ఉండటం విశేషం. అలాగే శేరిలింగపల్లిలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి విజయం దిశగా దూసుకపోతోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం నెగ్గిన - సెటిలర్ల సంఖ్య బాగానే ఉండే జూబ్లిహిల్స్ లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి లీడ్ లో ఉండటం విశేషం. మొత్తానికి తెలంగాణలో సైకిల్ టైర్లకు పంచర్లు పెద్దగానే అవుతున్నాయి.