Begin typing your search above and press return to search.
నందమూరి సుహాసిని ఎందుకొచ్చింది?
By: Tupaki Desk | 14 Jan 2020 11:01 AM GMTనందమూరి సుహాసిని.. దివంగత నందమూరి హరికృష్ణ కూతురు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి టీడీపీ తరుఫున పోటీచేసి వార్తల్లో నిలిచారు. రాజకీయాలకు పూర్తి దూరంగా ఉండే ఆమెను హరికృష్ణ మరణంతో తెరపైకి తెచ్చి చంద్రబాబు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత కూకట్ పల్లి అసెంబ్లీ స్థానం నుంచి సుహాసిని ఓడిపోవడంతో ఇక మళ్లీ కనిపించలేదు.
తాజాగా అమరావతి రాజధాని మార్పునకు వ్యతిరేకంగా ఆ ప్రాంత మహిళలంతా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగుతున్న సంగతి తెలిసిందే. రైతులకంటే కూడా ఉధృతంగా పోరాడుతున్నారు. మహిళా నిరసనకారులపై పోలీసుల దురుసుగా ప్రవర్తించడం.. అది వార్తల్లో రావడం తెలిసిందే. దీనిపై హైకోర్టు కూడా ఏపీ పోలీస్ విభాగానికి నోటీసులు ఇచ్చింది.
ఆశ్చర్యకరంగా ఇన్నాళ్లు మౌనంగా ఉన్న నందమూరి సుహాసిని మంగళవారం అమరావతిలో పర్యటించారు. మహిళా నిరసనకారులకు తన సంఘీభావం తెలిపారు. ఎర్రలపాలెం, కృష్ణయపాలెం, మందడం, వెలగపూడి, తుల్లూరు గ్రామాల మహిళలను కలుసుకొని.. వారి నిరసనకు - ఆందోళనలకు మద్దతు తెలిపారు. రాజధానిని మార్చాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మీడియాకు, రాజకీయాలకు పూర్తి దూరంగా ఉన్న సుహాసిని చాలా కాలం తర్వాత అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. అమరావతి ఆందోళనలతో అట్టుడుకుతుండడంతో రాజకీయాల్లో యాక్టివ్ కావడానికి ఇదో మార్గంగా రాజధాని ప్రాంతంలో పర్యటించినట్లు తెలుస్తోంది.